Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్‌‌ను చూస్తే నాకు కడుపు మంట... అందుకే అలా చేశా... నటి హేమ

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:48 IST)
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు... ఇంకా చెప్పాలంటే... ఆయన సినిమాలలోని డైలాగ్‌లు వింటూ ఆ టేకింగ్ చూస్తూ అందులో ప్రతి పాత్ర మన పక్కనే జీవిస్తూ ఉంది అనిపించేలా తీసే డైరెక్టర్. ఇక ఆయన రూపొందించే పాత్రల గురించైతే చెప్పనక్కర్లేదు... అలాంటి దర్శక మాంత్రికుడికి తనకీ ఏర్పడిన విభేదాలను గురించి ఆయన సినిమాలలో నటించి మంచి పేరు కొట్టేసిన హేమ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతికి ఆరేసింది.
 
"ఏమండీ హేమ గారు వరుసగా త్రివిక్రమ్ సినిమాల్లో చేశారు కదా? ఇప్పుడు ఏమైంది?" అని అడిగితే తన రెమ్యూనరేషన్ విషయంలో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన సినిమాల నుండి తాను తప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ‘అసలు నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి త్రివిక్రమ్ ఎవరు? సినిమా అంటే దానికో ప్రొడ్యుసర్ ఉంటారు. మేనేజర్ ఉంటారు. వాళ్లు మాట్లాడతారు. ఒకవేళ నాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతే.. అమ్మా మేం అంత ఇవ్వలేం.. ఇష్టమైతే చేయండి.. కష్టమైతే మానేయండి అని చెప్తారు. మధ్యలో ఈయనకు సంబంధం ఏంటి? 
 
ఇన్ని సంవత్సరాలు త్రివిక్రమ్‌తో ట్రావెల్ చేసినా ఆయనకు నా మాట మీద నమ్మకం లేదు. అందుకే కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయా. నా ఇగోని హర్ట్ చేయడం వల్ల ఆయనతో మాట్లాడటం మానేశా. ఫోన్ చేయడం మానేశా. ఆయన ఎదురుపడినా పలకరించేదాన్ని కాదు. నాకు అంతలా మండేలా చేశారు. కడుపు మంటతో చెబుతున్నా’ అంటూ త్రివిక్రమ్‌తో ఉన్న వివాదాన్ని బయటపెట్టారు. 
 
ఏదైనా సినిమాలో హీరోహీరోయిన్లు దర్శకుల కోసం వంద టిక్కెట్లు వస్తే నాలాంటి వారి కోసం పది పదిహేను టిక్కెట్లైనా వస్తాయని చెప్పిన హేమకి మరి ఎలాంటి రోజులు రానున్నాయో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments