Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రూ.2 కోట్లు నిధులెక్కడ? నరేష్‌ను టార్గెట్ చేసిన హేమ

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (14:27 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు టాలీవుడ్‌లో కాక పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమలు వేర్వేరుగా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటోన్న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. 
 
ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేశ్‌పై తాజాగా సినీ నటి హేమ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ంటూ ఆమె తాజాగా ఆరోపించారు. లేదంటే ఎన్నికలు లేకుండా నరేశ్‌నే మ‌ళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు. 
 
అదేసమయంలో నరేష్ కూడా మా అధ్యక్ష ప‌ద‌వి నుంచి దిగకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అదేసమయంలో మా నిధుల ఖర్చులో కూడా దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 
 
మొత్తం రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగిలన రూ.2 కోట్ల నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఈ విషయమై 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. అలాగే, మా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఆమె గట్టిగా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments