Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ యాప్‌లో సంపూ హీరోయిన్ ఫోటోలు

Webdunia
బుధవారం, 26 మే 2021 (14:52 IST)
ఇటీవలి కాలంలో సినీ హీరోయిన్ల ఫోటోలను డేటింగ్ యాప్‌లలో పోస్ట్ చేసి, వాటితో డబ్బులు సంపాదించడం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ కోవలో ఇపుడు టాలీవుడ్ నటి గీతాంజలి ఫోటోలు కూడో ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గీతాంజలి ఫోటోలు ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె స్నేహితులు ఖంగుతిని గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, 'డేటింగ్ యాప్‌లో నా ఫొటోలు ఉన్నట్లు నా స్నేహితురాలు కాల్ చేసి చెప్పేవరకు నాకు తెలీదు. హాట్ లైవ్ డేటింగ్ యాప్‌లో నా ఫొటో ఉన్నట్లు నాకు కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో నేను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. సెలబ్రిటీల ఫొటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకో అమ్మాయికి ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఒక రంగంలో ఎదుగుతుంటే కొందరు కావాలని ఇలా టార్గెట్ చేస్తారు. నాపై వ్యక్తిగతంగా అసూయ పెట్టుకుని ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నా. నా అనుమానాలకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులకు అందజేశాను. పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులపై నాకు నమ్మకం ఉంది. నిందితులపై కఠిన  చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈమె గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన "కొబ్బరి మట్ట" చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఈమె ఇప్పటివరకు 30కి పైగా చిత్రాల్లో నటించారు.   
 
గీతాంజలి 32 సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమాతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments