Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే పేరు, డ‌బ్బు తీసుకువ‌స్తోందిః నిర్మాత‌, హీరోయిన్ మిత్ర శ‌ర్మ

Advertiesment
అదే పేరు, డ‌బ్బు తీసుకువ‌స్తోందిః నిర్మాత‌, హీరోయిన్ మిత్ర శ‌ర్మ
, సోమవారం, 24 మే 2021 (12:28 IST)
Mitraaw Sharma
సినిమా నిర్మాణం అంటే క‌త్తిమీద సామే, చిత్ర పరిశ్ర‌మ‌లో కొమ్ములు తిరిగిన ఉద్దండ ప‌డ్డింతులు కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్ట‌డానికి సాహాసం చేయ‌రు, అలాంటి చేతిలో రూపాయ్ కూడా లేకుండా బాంబే నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మిత్ర శ‌ర్మ‌ ఎన్నో ఒడిదిడుకుల ఎదుర్కొని, న‌టిగా ఆ త‌రువాత సినిమా మ‌క్కువతో నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన సినిమా బాయ్స్, మిత్ర నిర్మ‌త‌గా తెర‌కెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌నల్ కంటెంట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ ట్రెండ్ అవుతుంది. 
 
మే 24న మిత్ర‌శ‌ర్మ‌ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు. బాంబేలో పుట్టి పెరిగిన మిత్ర‌ వాస్త‌వానికి అక్క‌డ‌ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ తెలుగు మాత్రం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌తారు. సినిమా మీద మక్కువుతో కొంద‌రు స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హాతో బాంబే నుంచి హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయ్యారు మిత్ర‌, ఇక్క‌డకు వ‌చ్చిన త‌రువాత అనేక సినిమా ఆఫీసులు చుట్టూ అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నం చేసి, స‌రైన ఆఫ‌ర్లు కోసం ప్ర‌య‌త్నం చేసేకంటే తానే న‌లుగురికి అవ‌కాశం ఇచ్చి వారిలో ఉన్న ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ శ్రీపిక్చ‌ర్స్ అనే సినీ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి, నూత‌న తారాగ‌ణంతో బాయ్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇదే చిత్రంలో తాను కూడా ఓ హీరోయిన్ గా న‌టించారు. యూతుఫుల్ కాలేజ్ ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. 
 
దీనికి సంబంధించిన ఆడియో నుంచి తాజాగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాహుల్ సిప్లీగంజ్ పాడిన హేరాజా అనే పాట యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ కి పైగా ద‌క్కించుకుని, సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వినూత్న‌మైన ప్ర‌య‌త్నాల్ని ఎల్ల‌ప్పూడు తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూ ఉంటారు, ఆ న‌మ్మ‌కంతోనే తాను క‌ష్ట‌ప‌డి సంపాదించిన ప్ర‌తి రూపాయ్ ఖ‌ర్చుపెట్టి బాయ్స్ చిత్రాన్ని నిర్మించిన‌ట్లుగా తెలిపారు యువ నిర్మాత న‌టి మిత్ర‌శ‌ర్మ‌. చేసే ప‌ని మీద గౌవ‌రం ఉంటే అదే మ‌నకి పేరు, డ‌బ్బు సంపాదించిపెడుతుంద‌ని చెబుతున్న మ‌త్ర‌శ‌ర్మ‌. శ్రీశైలం మ‌ల్లీఖార్జున నిత్యం పూజిస్తుంటారు. ఆ స్వామీ ఆశిస్సుల‌తో ప్రేక్ష‌కులకి త‌న చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు న‌టి, యువ‌నిర్మాత మిత్ర‌శ‌ర్మ‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో రోహిత్, కోహ్లి లాభంలేదు, బుమ్రా సూటిగా వేశాడంటే అంతే: దిశా పటాని