మా కుటుంబాన్ని రక్షించండి ప్లీజ్... కన్నడ నటి కన్నీటి వినతి...
కర్ణాటక రాష్ట్రంలో రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలు వరద ముంపులో ఉన్నాయి. ముఖ్యంగా, కరావళి, మలెనాడు ప్రాంతాలు వరద గుప్పిట్లో విలవిలాడుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలు వరద ముంపులో ఉన్నాయి. ముఖ్యంగా, కరావళి, మలెనాడు ప్రాంతాలు వరద గుప్పిట్లో విలవిలాడుతున్నాయి.
సుమారు 12 రోజులుగా కుంభవృష్టి కొడగు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, చిక్కమగళూరు, చామరాజనగర, శివమొగ్గ తదితర జిల్లాలను వణికిస్తోంది. కొడగు అత్యధికంగా నష్టపోయింది. జిల్లాలో ఇప్పటికి ఆరుగురు మరణించగా, సుమారు 100 మంది ఆచూకీ తెలియడం లేదు.
ఈ నేపథ్యంలో మడికెరిలో చిక్కుకున్న తన కుటుంబాన్ని తక్షణం రక్షించాలని సీఎం కుమారస్వామికి కన్నడనటి దిశా వూవయ్య విజప్తి చేశారు. 8 మంది కుటుంసభ్యులు బయటకు రావడానికి వీలుకాక ఇంటిలో ఉన్నారని, వారిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు సీఎంకు ఆమె విన్నవించారు. తక్షణం ఆమెకు వైద్య సహాయం కూడా చేయాలన్నారు. అదేప్రాంతంలో 40 మంది వరదలో చిక్కుకున్నట్లు తెలిపారు. దీంతో తక్షణ సహాయ చర్యలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.