Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు వసూలు చేసి స్వాహా... చీటింగ్ కేసులో హీరోయిన్ అరెస్టు

చీటింగ్ కేసులో కేరళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ ధన్య మేరీ వర్గీస్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఈమెను అదుపులోకి తీసుకున్నారు.

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:10 IST)
చీటింగ్ కేసులో కేరళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ ధన్య మేరీ వర్గీస్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఈమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్‌మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ధన్యతోపాటు ఆమె భర్త జాన్ జాకబ్‌స సోదరుడు శామ్యూల్‌లను కూడా అరెస్టు అయ్యారు. శాంసన్ అండ్ సన్స్ సంస్థ తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరంతా కలిసి బాధితులు ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసి ముఖం చాటేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. 
 
ధన్య మామ జాకబ్ శాంసన్‌ని గతంలోనే క్రైం డిటాచ్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 2014 నుంచీ ఈ కేసు నడుస్తోంది. 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. పలు సినిమాల్లో తన నటనతో ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకున్నారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించాడు. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments