Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైంపాస్‌ పాప్‌కార్న్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'... రివ్యూ రిపోర్ట్

సినిమాలను కామన్‌మేన్‌ కూడా సరదాగా జోక్‌లేసుకుంటూ మాట్లాడేవి కొన్ని వుంటాయి. సీరియస్‌, హాస్య చిత్రాలు.. యాక్షన్‌, ప్యారడీ... ఇలా రకరకాల కథలతో వచ్చే చిత్రాలు చూశాం. సినిమా ఇండస్ట్రీపై సెటైర్‌ వేసే చిత్రాలు కూడా వచ్చాయి. 'ఖడ్గం'లో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అ

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (15:13 IST)
మీలో ఎవరు కోటీశ్వరుడు నటీనటులు: పృధ్వీ, సలోని, నవీన్‌చంద్ర, శ్రుతిసోడి, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, పోసాని, మురళీశర్మ తదితరులు, నిర్మాత: రామ్మోహన్‌, మాటలు: మోహనరావు, దర్శకత్వం: ఇ. సత్తిబాబు, 
 
సినిమాలను కామన్‌మేన్‌ కూడా సరదాగా జోక్‌లేసుకుంటూ మాట్లాడేవి కొన్ని వుంటాయి. సీరియస్‌, హాస్య చిత్రాలు.. యాక్షన్‌, ప్యారడీ... ఇలా రకరకాల కథలతో వచ్చే చిత్రాలు చూశాం. సినిమా ఇండస్ట్రీపై సెటైర్‌ వేసే చిత్రాలు కూడా వచ్చాయి. 'ఖడ్గం'లో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పే.. పృథ్వీ చేత ఇంటర్‌మీడియట్‌ చదివే కుర్రాడిలా నటింపచేస్తే ఎలా వుంటుందనేది... దర్శకుడు సత్తిబాబుకు వచ్చిన ఆలోచన. ఆ చిత్రాన్ని ఆయన ఎలా చేశాడో చూద్దాం.
 
కథ:
శ్రుతిసోడి.. తన స్నేహితులతో కలిసి రాత్రిల్ళు మందు తాగుతూ కారును స్పీడ్‌గా డ్రైవ్‌చేస్తూ స్తంభానికి గుద్దేస్తుంది. అక్కడ నుంచి తూలుతూ వస్తుండగా నవీన్‌చంద్ర చూసి ఆమెను ఆమె ఇంటిదగ్గరే జాగ్రత్తగా దించేస్తాడు. తెల్లారితే వచ్చిన స్నేహితులు శ్రుతిపై సెటైర్లు వేస్తారు. నిన్నేమి చేయలేదంటే నువ్వు బాగోలేదని అర్థమంటూ రెచ్చగొడతారు. ఆ తర్వాత సీసీ పుటేజ్‌లో అతని ఫేస్‌ చూసి కాలేజీలో అతన్ని కలుసుకుంటుంది. నన్ను ఏదో ఒకటి చేసేయంటూ వెంటబడుతుంది. చివరికి నవీన్‌ చాలా మంచివాడని డిసైడ్‌ అయి ప్రేమించేస్తుంది. కోటీశ్వరుడైన ఆమె తండ్రి మురళీశర్మకు ఇష్టముండదు. రైతు రైతులానే వుండాలి. వ్యాపారస్తుడు వ్యాపారస్తుడులాగే వుండాలి అని రూల్ అంటూ క్లాస్‌ పీకుతాడు. దాంతో కోట్లున్నా మీరు ఇవ్వలేని ఆనందాన్ని తాను ఇస్తానని.. నవీన్‌ చెబుతాడు. 
 
ఆనందం అంటే ఏమిటి? అమ్మాయికి అన్ని సమకూరుస్తున్నానని దానిలోని సంతోషం ఎక్కడుంటుంది అని బదులిస్తే ఆనందం వేరు... సంతోషం వేరని అంటాడు. ఆనందంగా వుండాలంటే ఒక్క వ్యాపారంలో ఫెయిల్‌ అయి చూడు.. ఆనందం ఎలా వుంటుందో అని సవాల్‌ వేస్తాడు నవీన్‌. దాంతో మురళీవర్మ.. ఓ ఐడియా ఇస్తే కోటి ఇస్తానంటూ ప్రకటన ఇస్తాడు. దాని ప్రకారం సినిమా తీస్తే చాలని పోసాని ముందుకు వస్తాడు. చెత్త దర్శకుడితో పరమ చెత్తకథతో తీస్తాడు. కానీ అది సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది.. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటుడిపరంగా.. నవీన్‌చంద్ర.. తన గతంలో చేసినట్లే చేశాడు. శ్రుతిసోడి.. హైటెక్‌ యువతిలా నటించింది. పృథ్వీ.. సినిమాలో సినిమా కథలో హీరో. తనలోని నటుడ్ని మరోసారి లేపాడు. ప్రముఖ హీరోల డైలాగ్‌ను చెప్పి పారడీలా చేసేశాడు. సలోని నటన బాగానే వుంది. జయప్రకాష్‌ రెడ్డి రాయలసీమ యాసతో నవ్విస్తాడు. చెత్త దర్శకుడిగా రఘుబాబు అలరించాడు. నిర్మాతగా పోసాని కృష్ణమురళీ జీవించాడు. ప్రభాస్‌ శ్రీను ప్రొడక్షన్‌ మేనేజర్‌గా అలరించాడు. ఇలా ప్రతిపాత్రీ ఏదోవిధంగా కథకు వుపయోగపడ్డారు.
 
టెక్నికల్‌గా...
కథ- మాటలు.. మోహన్‌ రావు రాశాడు. అసలు దర్శకుడుకు ఎలాంటి అర్హతలు వుండాలనేది ఆయన ఐదు వాల్యూమ్స్‌పై పుస్తకాలు రాశాడు. అలాంటి వ్యక్తి మాటలు రాసి సందర్భానుసారంగా డైలాగ్స్‌ పేల్చాడు. 'కార్‌వాన్‌ పెట్టలేదు.. అంటే.. పెట్ట, పుంజు అంటావేమిట్రా.. అయితే నేను హర్ట్‌.. అంటూ హీరో వెళ్ళిపోవడం.. వంటివి.. మాస్‌ సెటైరిక్‌గా మాటలు కూర్చాడు. ఇలా అన్ని సంభాషణలు వుంటాయి. ఇక సంగీతపరంగా పెద్దగా చెప్పుకోవాల్సి లేకపోయినా.. శ్రీవాస్‌ ఫర్వాలేదనిపించేలా బాణీలున్నాయి. కెమెరా పనితనం ఓకే.. ఇవివి శిష్యుడుగా సత్తిబాబు గతంలో పలు చిత్రాలు చేశాడు. అలాంటి తరహాలోనే తను దర్శకత్వం వహించాడు.
 
విశ్లేషణ :
ఇంతకుముందు భీమనేని శ్రీనివాసరావు అల్లరి నరేష్‌తో సుడిగాడు అనే చిత్రాన్ని తీశాడు. కథంతా అన్ని సినిమాలపై స్పూస్‌లాగా చేసేశాడు. ఇందులో పృథ్వీతో బాలయ్య, వెంకటేష్‌, చిరంజీవి వంటి కొందరి డైలాగ్స్‌ను అనుకరిస్తూ అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా మొత్తం ఇండస్ట్రీలో వున్న అన్ని శాఖలపై సెటైర్లుగా వేసేశాడు. ఆఖరికి మీడియాను కూడా వదల్లేదు. టీవీల్లో చర్చల్లో పాల్గొనే విధానాన్ని కూడా పారడీ చేసేశాడు.
 
హీరోలకు మనవళ్లు వున్నా ఇంకా తను హీరోగా చేస్తూ.. హీరోయిన్లతో గంతులేయడం, కాలేజీ చదవడం.. ఒక్కటేమిటి.. అన్నింటినీ చూపించి.. పాప్‌కార్న్‌ సినిమాగా మార్చేశాడు. ఇలా చేయడం పెద్ద సాహసం కాదు కానీ ఇలాంటి కథలు సరదాగా మాట్లాడుకోవడానికి పనికివస్తాయి. దాన్ని కథగా రాసుకుని తీసిన నిర్మాతను అభినందించాలి. పక్కా మాస్‌ చిత్రం గనుక.. వారికి నచ్చితే సినిమా ఆడినట్లే. 
 
రేటింగ్ : 2.5/5

రామోజీ రావుకు ఒకే ఒక కోరిక ఉండేది.. కనికరంలేని కార్మికుడు.. బాబు

పవన్‌ కళ్యాణ్‌ జీతం ఎంత?

రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కలవాలనుకున్నాను.. పవన్ కల్యాణ్

వైసిపి ఘోర పరాజయం: పదవీ బాధ్యతల నుంచి సజ్జల ఔట్?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments