Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాషాయదండు'లో చేరికపై తమిళ హీరో క్లారిటీ!

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:15 IST)
తమిళ యువ హీరోల్లో ఒకరైన విశాల్.. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై ఈ హీరో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు.
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఇందులోభాగంగా, బీజేపీ విశాల్‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, విశాల్‌ బీజేపీలో చేరనున్నారని, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్‌ కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం విశాల్‌ ఓ తమిళ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. 
 
కాగా, విశాల్ గతంలో నడిగర్‌ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుని, మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి నిర్వహించి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ, చివరి నిమిషంలో అది తిరస్కరణకులోనైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments