Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (16:49 IST)
ప్రముఖ హాస్య నటుడు వడివేలుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సుధీర్ఘ కాలం తర్వాత ఆయన "నాయ్ శేఖర్ రిటర్న్స్" అనే చిత్రంలో నటిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నై నగరంలో ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వడివేలు, దర్శకుడు సురాజ్‌, లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి తమిళ్ కుమరన్‌లు ఇటీవల లండన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి తాజాగా తిరిగి వచ్చారు. ఈ ముగ్గురికి జరిపిన కోవిడ్ పరీక్షల్లో వడివేలులో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ కూడా అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కోవిడ్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆయన నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్న విషయం తెల్సిందే. అలాగే, హీరో విక్రమ్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments