Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడిగా మారిన దర్శకుడు హరీష్‌ శంకర్‌

దేవి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (17:47 IST)
Harish Shankar, Suhas, Malavika Manoj
దర్శకులు నటులుగా మారడం మామూలే. ఆ కోవలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఒకరు. తాజాగా సుహాస్ కథానాయకుడు నటిస్తున్న ఓ భామ అయ్యో రామ’ చిత్రంతో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.

ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు,వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. హరీష్‌ శంకర్‌ కు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు. 
 
నిర్మాత మాట్లాడుతూ '' సుహాస్‌ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఓ బెస్ట్‌ క్వాలిటీ సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం వుంది. హరీష్‌ శంకర్‌ గారు అడ్గగానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
 
అంతేకాకుండా, కథలో మరిన్ని అంశాలను అందించేందుకు సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది – మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు.
 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
నటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనితా హసనందిని, అలి, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments