Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న సినిమా బతకాలంటే ఏపీలో ఫిలిం సిటీ ఏర్పాటు కావాలి... సుమన్

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (11:11 IST)
ఏపీకి చిత్ర పరిశ్రమ తరలింపు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సుమన్. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికలు, ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుతో అంతా తీరిక లేకుండా ఉండటంతో తాను ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమకు అవకాశాలు కల్పించడం, స్టూడియోలు కట్టడమే కాకుండా మరిన్ని పనులు చేయాలని సుమన్ సూచించారు. చిన్న సినిమాలు ఆడాలంటే లొకేషన్లు కూడా బాగుండాలని, పెద్ద సినిమాలు 20 శాతం ఏపీలో తీసి మిగిలినవీ ఫారిన్‌లో తీస్తున్నారన్నారు. 
 
బడా నిర్మాతలకు సెట్స్ వేసి షూటింగ్ చేసుకునేంత డబ్బు ఉంటుందని, కానీ చిన్న సినిమా బతకాలంటే ఏపీలో ఫిలిం సిటీ మాదిరిగా చిన్న చిన్న సెట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన సూచించారు. 
 
తమిళం, మలయాళ ఇండస్ట్రీ వాళ్లు రాసే కథల్లో స్వేచ్ఛ ఉంటుందని, వారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని సుమన్ వ్యాఖ్యానించారు. కండీషన్లతో ఏపీకి సినీ పరిశ్రమ తరలిపోయే ఆస్కారం వుందని సుమన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments