నాన్న మాటలతో కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్ బాబు, ఏమైంది..?

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (15:13 IST)
హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం వి. విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన వి సినిమా ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీసాఫీర్‌గా నటించారు. ఇందులో సుధీర్ బాబు నటనను సినీ పండితుల నుంచి సైతం ప్రశంసించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సుధీర్ బాబు తదుపరి చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. 
 
ఇదిలాఉంటే... సుధీర్ బాబు చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి ఆయన దర్శకులు, అభిమానులు రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ట్వీట్లో ఏముందంటే.. హీరో సుధీర్ బాబు ఒకప్పుడు స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అయితే... సినిమాలపై మక్కువతో ఆయన బ్యాడ్మింటన్ వదిలి సినిమాల్లోకి వచ్చారు.
 
ఇది సుధీర్ బాబు తండ్రికి ఇష్టం లేదు. దీంతో సుధీర్ బాబుతో ఆయన ఫాదర్ మాట్లాడటం మానేశారట. అయితే... సుధీర్ బాబు తాజా సినిమా వి చూసి ఆయన సుధీర్ బాబును మెచ్చుకున్నారట. అంతే.. ఎప్పటి నుంచో మాట్లాడటం మానేసిన నాన్న వి సినిమా చూసి మాట్లాడటంతో సుధీర్ బాబు కన్నీళ్లతో మనసులో మాటలను బయటపెట్టారు.
 
 
 
ఎప్పుడూ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడని నాన్న, అలా... వి సినిమా గురించి స్పందించడం చూసి ఉద్వేగానికి లోనయ్యారు సుధీర్ బాబు. నాన్న వి సినిమా గురించి మాట్లాడటం తనకు ఎనలేని సంతోషాన్ని అందిస్తుందని... ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇంతటి ఆనందాన్ని అందించిన వి సినిమాని ఎప్పటికీ మరచిపోలేను అన్నారు సుధీర్ బాబు. ఈ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments