Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త వ్యసనపరుడు... నాకు సుఖమివ్వలేదు... భరణం ఇప్పించండి : కోర్టులో పృథ్వీ భార్య గెలుపు

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. ఆయనపై భార్య పెట్టి కేసులో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈ

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (11:03 IST)
'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. ఆయనపై భార్య పెట్టి కేసులో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈ బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూకు మైండ్‌‌బ్లాంక్‌ అయ్యింది. పృథ్వీ భార్యకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో థర్టీ ఇయర్ ఇండస్ట్రీ స్టార్‌ చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఈ కమెడియన్‌పై భార్య దాఖలు చేసిన కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... 
 
విజయవాడ అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మిని నటుడు శేషు అలియాస్‌ మూర్తి అలియాస్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ గత 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహిస్తూ వచ్చేది. ఆమె తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి నిర్వహిస్తూ వచ్చిన దుకారణంలో పృథ్వీరాజ్‌ కూడా కొంతకాలం పని చేశారు. ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో తరచూ చెన్నై వెళ్లేవారు పృథ్వీరాజ్‌.
 
క్రమేణా సినీ రంగంలో రాణించడంతో కాపురం హైదరాబాద్‌కు మారింది. భాగ్యనగరానికి చేరుకున్న తర్వాత తన భర్త వ్యసనపరుడయ్యాడనీ, తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా, 2016 ఏప్రిల్‌ 5న ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. దీంతో ఆమె విజయవాడకు చేరుకుంది. పిమ్మట భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నించారు. అయినా పృథ్వీ పట్టించుకోలేదని శ్రీలక్ష్మీ ఆరోపిస్తోంది. దీంతో 2016 నవంబరు 2న సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త పృథ్వీపై కేసు పెట్టగా, సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారు.
 
అదేసమయంలో తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధి నిమిత్తం అతని నుంచి నెలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాలని కోరుతూ విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పృథ్వీకి పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఆయన ఆ సమన్లు తీసుకోక పోవడంతో హైదరాబాద్‌లో పేపరు ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చారు. ఆపై కేసు వాయిదాకు పృథ్వీరాజ్‌ హాజరు కాలేదు. చివరకు బాధితురాలి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో పృథ్వీరాజ్‌కి ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. 

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments