Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ థ్రిల్లర్ : ప్రదీప్ - పావని మధ్యలో శ్రావణ్.. ఆ రాత్రి అసలేం జరిగింది?

బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ హత్య మిస్టరీగా మారింది. ఈ కేసులో అందరి వేళ్లూ ప్రదీప్ భార్య పావనీ రెడ్డి, ఈమె ఫ్రెండ్ శ్రావణ్‌లవైపే చూపిస్తున్నాయి. అందుకే ప్రదీప్ అంత్యక్రియల తర్వాత హైదరాబాద్ నగర పోలీస

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (14:34 IST)
బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ హత్య మిస్టరీగా మారింది. ఈ కేసులో అందరి వేళ్లూ ప్రదీప్ భార్య పావనీ రెడ్డి, ఈమె ఫ్రెండ్ శ్రావణ్‌లవైపే చూపిస్తున్నాయి. అందుకే ప్రదీప్ అంత్యక్రియల తర్వాత హైదరాబాద్ నగర పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణ అనంతరం.. భార్యాభర్తల మధ్య జరిగిన స్వల్ప గొడవ కారణంగా ప్రదీప్ క్షణికావేశానికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడనీ పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రదీప్, పావనీ మధ్యలో శ్రావణ్‌ పాత్రను ఓసారి పరిశీలిస్తే... 
 
ప్రదీప్ - పావనిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని ట్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివశిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంతలో అంటే నాలుగు నెలల క్రితం ఖతార్ నుంచి శ్రావణ్ అనే వ్యక్తి ప్రదీప్ ఇంటికి వచ్చి.. వారితో కలిసే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శ్రావణ్ బర్త్‌డేను ప్రదీవ్ ఇంట్లోనే జరుపుకున్నారు. 
 
శ్రావణ్‌ పుట్టిన రోజు వేడుక ముగిసిన తర్వాత స్నేహితులందరూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఫ్లాట్‌ నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య స్పల్ప వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ''నన్ను నువ్వు అంతగా పట్టించుకోవడం లేదు'' అంటూ భార్య పావని వద్ద ప్రదీప్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. తాను ఎలా ఉంటున్నానో వివరించిన పావని... భర్త నుంచి అలాంటి ప్రశ్న ఎదురుకావడంతో బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. 
 
దీనిని గుర్తించిన ప్రదీప్ రెండు సార్లు తలుపు తీయమంటూ తట్టాడు. తిట్టాడన్న బాధతో ఆమె తలుపు తీయలేదు. దీంతో పార్టీలో ఫుల్లుగా మద్యం తాగిన ప్రదీప్, పక్కనే ఉన్న అద్దాన్ని బలంగా కొట్టాడు. దీంతో అది పగిలిపోగా, గాజుపెంకులు అతని చేతికి గుచ్చుకున్నాయి. ఈ శబ్దానికి బయటకు వచ్చిన పావని.. అతని చేతికి వస్తున్న రక్తాన్ని తుడిచి, చేతికి కట్టుకట్టింది.
 
దీంతో ఇద్దరి మధ్యా వివాదం సద్దుమణిగింది. ఉదయం షూటింగ్‌‌కు వెళ్లాలని చెప్పిన ప్రదీప్‌, బెడ్రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఉదయం షూటింగ్‌‌కు సమయవుతోందంటూ భార్య తలుపు తట్టగా తీయలేదు. అనుమానంతో తలుపులు పగులగొట్టగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్న ప్రదీప్‌ కనిపించాడు. 
 
అయితే, ఖతార్ నుంచి వచ్చిన శ్రావణ్... సొంతూరు విశాఖపట్టణం. పావనికి స్నేహితుడు. అయితే ప్రదీప్‌తో వివాహానికి శ్రావణే కారణం. వారి వివాహాన్ని దగ్గరుండి చేయడంతో ఇద్దరికీ శ్రవణ్ మంచి స్నేహితుడిగా మారాడు. ఖతార్‌లో ఉద్యోగం చేసి, హైదరాబాద్ వచ్చిన శ్రవణ్‌, ప్రదీప్‌ వారింట్లనో ఉంటున్నాడు. శ్రావణ్ కారణంగా కుటుంబ సభ్యుల వద్ద ప్రదీప్ తీవ్ర అవమాన పాలయ్యాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడన్న టాక్ కూడా వినపడుతోంది. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments