Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రయాణం'' పాయల్ ఘోష్‌పై యాసిడ్ దాడి.. వామ్మో హీరోయిన్‌కే..?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (19:12 IST)
Payal Ghosh
హీరో మంచు మనోజ్ ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన "పాయల్ ఘోష్"కు అన్యాయం జరిగింది. తాజాగా ఈ హాట్ బ్యూటీపై గుర్తు తెలియని వ్యక్తులు తన పై యాసిడ్‌ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని పాయల్ తెలిపింది. ఇంకా చేతికి గాయాలైన పిక్‌ను కూడా తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆ పిక్‌తో పాటు ఆమె ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
 
పాయల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లి.. ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకొచ్చే వద్దామని వెళ్లాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారని రాసుకొచ్చింది.
 
అయితే, ఆమె వారి నుంచి తప్పించుకున్నప్పటికీ ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. 
 
ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అంటూ పాయల్‌ తెలియజేసింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. హీరోయిన్‌కే ఈ దుస్థితి ఏర్పడినప్పుడు ఇక సామాన్య మహిళల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments