Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:56 IST)
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం నెలకొంది. 93 యేళ్ల మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతూ వచ్చిన ఆమె కొచ్చిన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మమ్ముట్టి తల్లి మరణవార్తతో మాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సెలెబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
మరోవైపు, ఫాతిమా ఇస్మాయిల్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం కొట్టాయం జిల్లాలోని చెంబులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు మమ్ముట్టితో పాటు ఇబ్రహీం కుట్టి, జకారియా అనే ఇద్దరు కుమారులు, అమీనా, సౌదా, షఫీనా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మమ్ముట్టి తెలుగులో స్వాతికిరణం చిత్రంలో నటించారు. 
 
మరెన్నో డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. మరో వారం రోజుల్లో విడుదలకానున్న అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రంలో కూడా మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన తాజా చిత్రం సీతారామం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదు.. మోడీ ఫలితాలు : రాహుల్ గాంధీ

దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments