Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత చీప్ క్యారెక్టర్.. ఆ వ్యక్తిని ఏకేశానని చెప్పిన బ్రహ్మాజీ

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:36 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సమంత, చైతూ విడాకులపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంతపై వచ్చిన ట్రోల్స్ మీద సీరియస్ అయ్యారు బ్రహ్మాజీ. తాను సాధారణంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని.. కానీ మాట్లాడాల్సిన సమయంలో కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు. 
 
సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఓ వ్యక్తి సమంతపై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. నాగచైతన్య దగ్గర రూ.250 కోట్లు భరణం తీసుకుందని, గేమ్‌ ప్లే చేసిందని, సమంత సెకండ్‌ హ్యాండ్‌ అంటూ చీప్‌గా మాట్లాడాడు. సమంత కూడా ఆ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చింది. కానీ అతడి మాటలకి తనకు కూడా కోపం వచ్చిందన్నారు. 
 
ఈ విషయంపైన కూడా తాను అతనితో మాట్లాడానని.. సిగ్గు శరం లేదని ఏకేశానని చెప్పారు. "నువ్వు థర్డ్‌ గ్రేడ్‌. ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలకు, నీకు సంబంధం ఏంటి?. సమంత ముఖం చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. 
 
కానీ సోషల్‌ మీడియా వల్ల కనీసం ఆమెతో నీకు మాట్లాడే అవకాశం వచ్చింది, దానికి సంతోషపడాలి. ఆ అమ్మాయిని పొగుడు, ఆమె యాక్టింగ్‌ నచ్చకపోతే చెప్పు. అంతే కానీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు నువ్వెవరు? అని అతని మీద సీరియస్ అయ్యాను" అని బ్రహ్మాజీ అన్నారు. 
 
కాగా.. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత కొంతకాలం మోటివేషన్ కొటేషన్స్‌ను షేర్ చేసింది. 
 
ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో విహారయాత్రలను ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. అటు నాగచైతన్య కూడా తన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments