ఆచార్య‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా బాగా ఆడాలి- ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్ అల్లు అర్జున్ః బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (23:41 IST)
Allu arjun- Balakrishna-Boyapati
శ‌నివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన అఖండ ప్రీరిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్.. తమ్ముడు అల్లు అర్జున్‌కు థాంక్స్. ఆహా‌లో టాక్ షో చేస్తున్నాను.. మాకు, అల్లు కుటుంబంతో బంధం గురించి అప్పుడే చెప్పాను. బాబుకు నా ఆశీస్సులు. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. నలుమూలల నుంచి విచ్చేసిన అభిమానులకు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రోడ్యూసర్లకు, మీడియాకు అందరికి థాంక్స్. ఇది ఏ ఒక్కరి సినిమా అని అనుకోవడం లేదు. అందరికి శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలి. 
 
- మనం పలికే అక్షరంలో ఉండే బలం.. ఒక్కో అక్షరం కలిపితే మంత్రం అవుతుంది. ఆహాలో చేసినట్టుగానే.. ఓ భక్తి చానల్‌ కూడా మొదలుపెడదామని అనుకుంటున్నాం. వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, నమస్కరించుట, పరిచరియాలు చేయూట, స్నేహ భావంతో ఉండుట, మనో వాక్కాయాలను భగవంతుడికి అర్పించుట.. ఇదే అఖండ సినిమా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు సినిమా గురించి. ఆది దేవుడు ఆశీర్వాదం ఉంది. భారతదేశంలో ఉన్న భక్తిని.. అఖండ సినిమాతో ఇంకా బతికిస్తునందుకు ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు మన కళ్ల ముందు కనిపించే దేవుళ్లు.. వాళ్లు దేవుళ్ల కన్నా ఎక్కువ. నేను ఎక్కువగా ప్రేమించేది నాన్న గారిని. ఆయన నాకు గురువు, దేవుడు. ఆ తర్వాత నేను ప్రేమించేది నా అభిమానులను. విజయాలకు గర్వపడటం.. అపజయాలకు కుంగిపోం. అభిమానుల ఆశీస్సుల పొందగలుగుతున్నామంటే అది పూర్వ జన్మ సుకృతం. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ ‌కు హాట్సఫ్. 
 
- నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. ఇద్దరు తమ్ముళ్లు.. అల్లు అర్జున్, శ్రీకాంత్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. కరోనా కాలంలో కూడా ప్రాణాలను తెగించి షూటింగ్‌లు చేశాం. చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. పుష్ప, రాజమౌళి గారి రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. వాటికి రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి. మలయాళంలో బన్నీకి చాక్లెట్ బాయ్ అని పేరిచ్చారు. సినిమాకు భాష బేధం లేదు. మంచి సినిమాలు అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. అభిమానులు క్షేమంగా ఇళ్లకు చేరండి. ప్రజా సేవ చేస్తున్న నా అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉంటుంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

Narayana Murthy: కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణ మూర్తి దంపతులు

అనారోగ్యం ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేశారని భార్యను హత్య చేసిన భర్త.. ఆర్నెల్ల తర్వాత...

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments