Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ కలెక్షన్లపై అబద్ధాల కథనాలు.. మొత్తం వసూళ్లు రూ. 1,864 కోట్లు మాత్రమేనట

అనుమానిస్తున్నదే నిజం అయింది. బాహుబలి 2 సినిమా ప్రభంజనంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు కుట్ర పన్నుతున్నారని, దాని అద్భుత కలెక్షన్ల రికార్డులను తారు మారు చేయాలని చిత్ర నిర్మాత అమీర్ ఖానే మాయ చేస్తున్నాడని, చైనా వెర్షన్ దంగల్ కలెక్షన్ల విషయంలో దొంగలెక్కలు చ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (03:19 IST)
అనుమానిస్తున్నదే నిజం అయింది. బాహుబలి 2 సినిమా ప్రభంజనంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు కుట్ర పన్నుతున్నారని, దాని అద్భుత కలెక్షన్ల రికార్డులను తారు మారు చేయాలని చిత్ర నిర్మాత అమీర్ ఖానే మాయ చేస్తున్నాడని, చైనా వెర్షన్ దంగల్ కలెక్షన్ల విషయంలో దొంగలెక్కలు చూపిస్తున్నారని, ప్రముఖ ట్రేడ్ అనలిస్టులు సైతం ఆ దొంగ లెక్కలకు వంతపాడుతున్నారని రెండు నెలలుగా వస్తున్న వార్తలను ప్రపంచం పెద్దగా పట్టించు కోలేదు కానీ ఇప్పుడు దంగల్ సినిమా అధికార ప్రతినిధే అంత సీన్ లేదని చెప్పడంతో నివ్వెరపోవలసి వస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా దంగల్ అంటూ ఊదర గొట్టిన ప్రచారం మొత్తం అబద్ధాలని, దాంట్లో వాస్తవం ఏమాత్రం లేదని ఆ అధికార ప్రతినిధి వెల్లడించడం షాక్ కలిగిస్తోంది.
 
బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన దంగల్ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.2,000 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించినట్టుగా ఇప్పటివరకు మీడియాలో అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ అదంతా అబద్ధమే అని.. అందులో వాస్తవం లేదని తాజాగా ఆ సినిమా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
గత గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా చైనీస్ వెర్షన్‌తో కలిపి దంగల్ రాబట్టిన మొత్తం వసూళ్లు 1,864 కోట్లు మాత్రమే అని దంగల్ సినిమా అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 23న రిలీజైన తమ దంగల్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన కనిపించినందుకు అమీర్ ఖాన్ సహా యూనిట్ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా వున్నారు. ఇంకా రిలీజ్ కానీ ప్రాంతాల్లోనూ దంగల్ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు.
 
మహవీర్ సింగ్ ఫోగట్ అనే ఇండియన్ రెజ్లర్, అతడి ఇద్దరు కూతుళ్లు గీతా సింగ్ ఫోగట్, బబితా సింగ్ ఫోగట్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా .. సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీం, సుహానీ భట్నాగర్, అపర్శక్తి ఖురానాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
 
దీన్ని బట్టి చైనా వంటి పెద్ద మార్కెట్లో విడుదల చేసి కూడా అమీర్ ఖాన్ బాపుకున్నది ఏమీ లేదని గత ఏడునెలల దంగల్ కలెక్షన్లు కూడా 1864 కోట్లను దాటకపోగా బాహుబలి 2 డైరెక్ట్ రిలీజ్‍‌లో తొలి రెండు నెలల కాలంలోనే 1700 కోట్లకు పైగా వసూలు చేసిందని రుజువవుతోంది. త్వరలో తైవాన్, చైనా, జపాన్ వంటి దేశాల్లో విడుదల కానున్న బాహుబలి 2 అవలీలగా 2 వేల కోట్ల వసూళ్లను దాటడం సాధ్యమేనని బాహుబలి అభిమానులు భావిస్తున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments