Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న వయసులో అలా చేశారు.. తెలుసుకునేటప్పటికీ యేడాది పట్టింది.. ఐరాఖాన్

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (08:30 IST)
ira khan
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ - రీనా దత్తాల కుమార్తె ఐరాఖాన్. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా అమిర్ ఖాన్ - రీనా దత్తాలు విడాకులు తీసుకున్నారు. అయితే, చిన్న వయసులో తనకు జరిగిన ఓ సంఘటన గురించి ఐరా ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు. 14 యేళ్ల ప్రాయంలో లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను 14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని, నిజానికి అప్పుడు అది ఏంటనేది తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. అప్పుడు జరిగిన దానిని తాను మాటల్లో చెప్పలేనని పేర్కొన్న ఐరా.. తనకు ఎదురైన అనుభం గురించి తెలుసుకోవడానికి తనకు యేడాది పట్టిందన్నారు. 
 
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మెయిల్ ద్వారా తెలియజేశానని, వారితో ఆ బాధను పంచుకున్నానని వివరించింది. ఆ తర్వాత ఎప్పుడూ తాను ఆ విషయం గురించి ఆలోచించలేదని, దానిని గురించి తలచుకుని భయపడకుండా ముందుకు సాగినట్టు పేర్కొంది.
 
తన తల్లిదండ్రులు ఆమిర్ ఖాన్-రీనా దత్తాలు విడాకులతో విడిపోవడం తనను బాధించలేదని ఐరాఖాన్ తెలిపింది. వారు విడిపోయినా స్నేహితుల్లా కలిసిమెలసి ఉన్నారని, తమది బ్రోకెన్ ఫ్యామిలీ కాదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో కొంత మానసిక ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని అంగీకరించింది. 
 
వారి విడాకుల వల్ల తాను కుంగుబాటుకు గురైనట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. వారు విడిపోయినప్పటికీ తమకు మాత్రం మంచి తల్లిదండ్రుల్లానే ఉన్నారని, వారి విడాకులు తనను బాధించలేదని పేర్కొన్న ఐరా.. తన కుంగుబాటుకు మాత్రం అది కారణం కాదని తేల్చి చెప్పింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం