'కేజీఎఫ్‌' 2 దర్శక నిర్మాతలకు అమీర్ ఖాన్ క్షమాపణలు

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:11 IST)
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కరీనా కపూర్ హీరోయిన్. అద్వైత్‌ చందన్ ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు. 
 
దేశంలోని పలు ప్రాంతాలలో మూవీ చిత్రీకరణ జరుపుకుంది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్‌కు హిందీ రీమేక్‌గా రూపొందిన 'లాల్‌సింగ్‌ చద్దా' చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఇదే తేదీన మరో పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్2 విడుదల కానుంది. ఇలా విడుదల తేదీలు క్లాష్ కావడంపై అమీర్ ఖాన్ స్పందించారు. 
 
రెండు భారీ సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం వల్ల చిత్ర నిర్మాతలకు నష్టం కలుగుతుందని భావిస్తున్నాంటూ కేజీఎఫ్-2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పారు. వేరే నిర్మాత ఫిక్స్‌ చేసుకున్న రిలీజ్‌ డేట్‌లో ఎప్పుడూ తన సినిమాను విడుదల చేయాలనుకోలేదు. కానీ ఈసారి మాత్రం తప్పడం లేదంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

తండ్రిని వదిలించుకోవడానికి ప్లాన్.. సినిమా షూటింగ్ చూపిస్తామని తీసుకొచ్చి గొయ్యిలో పడేసిన కుమారులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments