Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్ జడ్జిగా సీజన్ 4 తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

దేవీ
శనివారం, 30 ఆగస్టు 2025 (16:45 IST)
Aha Telugu Indian Idol Season 4
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. 
 
సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్ హంట్ లో భాగంగా అమెరికా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆడిషన్స్ లో ఎందరో ఔత్సాహిక గాయకులను ఎంపిక చేశారు. తదపరి దశలో వారందరిలో నుంచి టాప్ 12 కంటెస్టెంట్స్ ను నిర్ణయిస్తారు. 
 
మొట్లమొదటి లాంఛ్ ఎపిసోడ్ గా ఈ అడిషన్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ పోటీలో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కు సినీరంగంలో అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. మొదటి సీజన్ విన్నర్ వాగ్దేవి మరియు సాయి సౌజన్య స్టార్ సినిమాల్లో పాటలు పాడుతున్నారు. గత సీజన్ విన్నర్ నజీర్ త్వరలో రాబోతున్న ప్రముఖ చిత్రం ఓజీలో పాటకు తన గాత్రాన్ని అందించాడు. ప్రేక్షుకులకు  వినోదాన్ని పంచుతూనే ప్రతిభ ప్రోత్సహించేందుకు ఈ తరహా రియాలటీ షోలను అందిస్తున్నట్టు ఆహా యాజమాన్యం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

పాకిస్తాన్‌కి డబ్బిస్తే చేతికి చిప్ప వస్తుంది, బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ నుంచి చైనా ఔట్

5.2kg Baby: 5.2 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడ?

Man: సోదరుడిని కత్తితో పొడిచి చంపేసిన వ్యక్తికి జీవిత ఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments