Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న వ‌చ్చేస్తుంది

Aadavallu meeku Joharlu
Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (18:06 IST)
Sharwanand, Rashmika
శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  రష్మిక మందన్నా హీరోయిన్‌. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది.
 
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
 
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మొదటసారిగా రష్మిక, శర్వానంద్‌లు కలిసి నటించారు.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉండబోతోంది.
సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయనున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

Pawan Kalyan: దక్షిణాదిలో పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్న బీజేపీ..?

Sampurnesh Babu: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా వుండండి.. సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments