Webdunia - Bharat's app for daily news and videos

Install App

`99 సాంగ్స్‌` జంట‌కు ఎ.ఆర్‌. రెహ‌మాన్ ప్ర‌శంస‌‌

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:12 IST)
Rehman
ఆస్కార్ గ్రామీ అవార్డ్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈయ‌న కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్మాతగా మారారు.ఎ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా ర‌చ‌యిత‌గా రూపొందించిన చిత్రం `99 సాంగ్స్‌`. రొమాంటిక్ మ్యూజికల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `99 సాంగ్స్‌` చిత్రం ద్వారా ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ అనే నూత‌న నాయ‌కా నాయిక‌ల‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. 
రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో ఇహాన్, ఎడిల్‌సీ వార్గాస్ జంటను స్క్రీన్‌పై చూసిన నెటిజ‌న్స్ నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జియో స్టూడియోస్ సమర్పించిన ఈ ప్రేమ కథలో నటీనటులు మ్యూజికల్ రీసెర్చ్‌లో పాల్గొంటారు. వారి మ‌ధ్య ప్ర‌యాణాన్ని `99 సాంగ్స్` తెలియజేస్తుంది. 
 
ఈ సంద‌ర్భంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ ``ఇహాన్‌, ఎడిల్‌సీ వార్గాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల‌ను `99 సాంగ్స్‌` చిత్రంతో ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. వారిద్ద‌రూ గొప్ప ఆర్టిస్టులు. జీవితంలో వీరిద్ద‌రూ మ‌రింత ఉన్నత స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
ఇహాన్ భట్ మాట్లాడుతూ ``99 సాంగ్స్‌` ట్రైల‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చాలా ఆనంద‌మేస్తుంది. మా సినిమాకు, మా సినిమా సంగీతానికి వ‌స్తున్న అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. బాలీవుడ్‌లో ఎటువంటి నేపథ్యం లేనివారికి సులభంగా రాని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రెహ్మాన్ సార్‌కి నేను కృతజ్ఞతలు. ఇది నమ్మశక్యం కాని ప్రయాణం`` అన్నారు. 
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో ఇహాన్ భట్, ఎడిల్‌సీ వార్గాస్ జంట‌గా రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments