Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోలీసోడావే అంటూ మ‌త్తెక్కిస్తున్న పాయల్, మంచు విష్ణు పోస్ట‌ర్‌

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (13:08 IST)
golisoda song poster
హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
 
ఇటీవ‌లే జిన్నా టీజర్ విడుద‌లైంది. తాజాగా వీడియో సాంగ్ `గోలీసోడావే గుండెను మ‌త్తెక్కించే పానీబీడావే` అంటూ పాట రాబోతుంది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో మంచు విష్ణు పాయ‌ల్‌ను మ‌త్తుగా ప‌ట్టుకుంటూ సాగే పాట‌లో ప‌లువురు డాన్స‌ర్లు విష్ణు త‌ర‌హాలో మ‌త్తెక్కించేలా వున్నారు. ఈ పోస్ట‌ర్‌కు సోష‌ల్‌మీడియాలో మాంచి స్పంద‌న ల‌భిస్తోంది. చాలా కాలం త‌ర్వాత విష్ణు చేస్తున‌న సినిమాలో యూత్‌ను మ‌త్తెక్కించే అంశాలున్నాయంటూ స్పందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 19న ఫుల్ సాంగ్ విడుద‌ల‌కాబోతుంది. మ‌రి ఈ సాంగ్ విడుద‌ల త‌ర్వాత ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments