Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డైనమిక్‌గా వున్న మంచు విష్ణు జిన్నా టీజర్

Manchu Vishnu,  G. Nageshwar Reddy, Payal Rajput, Sunny Leone, Kona Venkat, Anup Rubens,  Surya
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:41 IST)
Manchu Vishnu, G. Nageshwar Reddy, Payal Rajput, Sunny Leone, Kona Venkat, Anup Rubens, Surya
డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలైంది.
 
జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో విష్ణు డైలాగ్ డిక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నప్పటికీ.. టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఢీ, దేనికైనా రెడీ తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా ఉన్న సినిమా అనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది.
 
టీజర్ విడుదల సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. "అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే మేం సినిమాలు చేసేది. అభిమానులు లేకపోతే మేం లేము. జిన్నా నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. వాళ్ళతో పాడించినందుకు బిగ్ థాంక్స్. మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబాయ్ అని పిలిస్తే, నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. నా కెరీర్ లో నాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక స్థానముంటుంది. నేను డౌన్ లో ఉన్న టైంలో ఆయన నాకు దేనికైనా రెడీ తో సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. కానీ కోన గారు, నాన్నగారు, తెలిసిన మీడియా మిత్రులు సన్నీకే ఓటు వేశారు. ఢీ ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. అనూప్ తో ఎప్పటినుంచో పని చేయాలి అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దేశంలోని గొప్ప సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన చోటా గారితో పని చేయడం గర్వంగా ఉంది. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా." అన్నారు.
 
పాయల్ మాట్లాడుతూ.. "టీజర్ జస్ట్ శాంపిల్.. పిక్చర్ అదిరిపోతుంది. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్. లవ్ యూ సర్. కోన గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకుంది.. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. ఆయన హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది." అన్నారు.
 
సన్నీ లియోన్ మాట్లాడుతూ.. " మీ అందరి అభిమానం వల్లే మేం పనిచేయ గలుగుతున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ టీమ్ తో వర్క్ చేస్తుంటే ఫ్యామిలీ ఉన్నట్టు అనిపించింది" అన్నారు.
 
డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ.. " జిన్నా సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి" అన్నారు.
 
కోన వెంకట్ మాట్లాడుతూ.. "నేను ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను. దానికి మొదటి ఇటుక వేసింది ఢీ సినిమా. స్టోరీ రైటర్ గా నాకు గుర్తింపునిచ్చింది ఆ సినిమానే. ఆ తర్వాత మా కాంబినేషన్ లో దేనికైనా రెడీ చేశాం. ఈ రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ రెండింటిని మించిన బ్లాక్ బస్టర్ జిన్నా అవుతుంది. విష్ణు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనకి పర్ ఫెక్ట్ మీటర్ లో ఈ సినిమా ఉంటుంది" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను స్టూడెంట్ సార్ అంటోన్న బెల్లంకొండ గణేష్