Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.పి. ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్ల‌కే టికెట్ల అమ్మ‌కం

Megastar Chiranjeevi
Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:04 IST)
Perni nani with cine celebrates
ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడుతూ సినీ ప‌రిశ్ర‌మ సంక్షోభంలో వుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారంనాడు చిరంజీవితోపాటు ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు, పంపిణీద‌రులు కూడా మంత్రి పేర్ని నానితో విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో స‌మావేశ మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించాం. ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపింది’ మంత్రి తెలిపారు.
 
కాగా, ఈ చ‌ర్చ‌లోని విష‌యాల‌ను సి.ఎం దృష్టికి తీసుకెళ్లి త‌దుప‌రి అంశాల‌ను వివరిస్తామ‌న్నారు. సినీ ప‌రిశ్ర‌మలోని చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌లుకూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. వాటిపై మ‌రోసారి చ‌ర్చించే ప‌నిలో వున్న‌ట్లు తెలుస్తోంది. అంద‌రూ పెద్ద నిర్మాత‌లు, హీరోలు, పంపిణీదారులే హాజ‌ర‌య్యారు. గ‌తంలో వై.ఎస్‌. హ‌యాంలో అటు పెద్ద వారిని, ఇటు చిన్న వారిని వేరువేరుగా పిలిచి సినీ స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సి.ఎం.లు ఈ విష‌యంలో శ్ర‌ద్ధ చూపలేదు. ముఖ్యంగా చిన్న సినిమాల వారికి రాయితీలు క‌ల్పించాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. దానిపై త్వ‌ర‌లో స్పందిస్తామ‌ని పేర్నినాని తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments