Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చ్ 5న "A"

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:22 IST)
నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై మోస్ట్ క్రియేటివ్ టెక్నికల్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ గీతా మిన్సాల నిర్మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం ‘A’. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో అనంత్ శ్రీరామ్ అద్భుత సాహిత్యాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ‘A’ చిత్రాన్ని వర‌ల్డ్ వైడ్‌గా మార్చి 5న పీవీఆర్ సినిమా విడుద‌ల ‌చేస్తుంది.
 
హీరోయిన్ ప్రీతీ అస్రాని మాట్లాడుతూ, అమాయ‌క‌త్వంగ‌ల‌ పల్లవి క్యారెక్టర్లో నటించాను. రెగ్యులర్ హీరోయిన్స్ క్యారెక్టర్లా కాకుండా టీనేజ్, మదర్ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్న ఛాలెంజింగ్ పాత్ర చేయడం చాలా టఫ్ అనిపించింది. ఎంతో రిహార్సల్స్ చేయించి నాతో అద్భుతంగా చేయించిన  డైరెక్టర్ యుగంధర్ మునికె ఈ క్రెడిట్ దక్కుతుంది. సైన్స్, ఫిక్షన్ బాక్డ్రాప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా యుగంధర్ రూపొందించారు. సినిమా చూశాక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని ఆడియెన్స్ అంతా ఫీలవుతారు. ఈ సినిమా నాకు వండర్ ఫుల్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది` అన్నారు. 
 
హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ, న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ అయి యుగంధర్ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. పెంటాస్టిక్ లైటింగ్స్, విజువల్స్ తో ప్రవీణ్ ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశాడు. రెగ్యులర్ ఫిల్మ్ లా కాకుండా హాలీవుడ్ స్థాయిలో "A"  సినిమా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది` అన్నారు. 
 
చిత్ర దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ, నితిన్ ప్ర‌స‌న్న ఈ చిత్రంలో మూడు పాత్ర‌లను పోషించారు. ట్రైల‌ర్ విషయానికి వ‌స్తే..ఒక వైపు సైన్స్, మ‌రో వైపు పూర్వ‌జ‌న్మ జ్ఞాప‌కాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంద‌నిపించేలా ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్ ఉంది. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయి పివిఆర్ ఉదయ్ వరల్డ్ వైడ్ గా మా "A"  చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మళ్లీ సీన్‌లోకి "డయల్ యువర్ సీఎం"

ఉద్యోగులకను డేటింగ్‌కు ప్రోత్సహిస్తున్న చైనా కంపెనీ... పార్ట్‌నర్‌ను వెతికిపెట్టినా సరే...

ఏపీ ఎన్నికల్లో నిజమైంది.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే ఏమంటోంది?

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments