నవీన్ చంద్ర లెవెన్ చిత్రంలో శ్వేతా మోహన్ పాడిన లవ్లీ మెలోడీ సాంగ్

Webdunia
గురువారం, 7 నవంబరు 2024 (17:14 IST)
Naveen Chandra
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రుతిహాసన్‌ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
 
తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి తగువాడు దొరికెనే సాంగ్ రిలీజ్ చేశారు. డి. ఇమ్మాన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. శ్వేతా మోహన్ లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.  
 
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.
 
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments