Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా అతిథి సిరీస్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (16:15 IST)
Avantika Mishra,
మాయ, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్నవెబ్ సిరీస్ “అతిథి”. వేణు తొట్టెంపూడి హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా రాబోతోంది. “అతిథి” వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి “అతిథి” స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో “అతిథి”లో నటించిన ఎక్సీపిరియన్స్ తెలిపింది అవంతిక మిశ్రా.
 
- నీలకంఠ గారి మాయ సినిమా ద్వారా నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. ఆ సినిమా తర్వాత నేను బెంగళూరులో పైలట్ కోర్స్ లో జాయిన్ అయ్యాను. వైశాఖం మూవీ తర్వాత తెలుగులో స్టార్స్ నటించిన రెండు మూడు చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆ సినిమాలు లాక్ డౌన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చాయి. కొన్ని ఆగిపోయాయి. దాంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది.
 
- నేను తమిళంలో రెగ్యులర్ గా మూవీస్ చేస్తున్నాను. నేను చేసిన కొన్ని తమిళ మూవీస్ చూసి “అతిథి”లో క్యారెక్టర్ కు కాంటాక్ట్ అయ్యారు. నాకు కెరీర్ లో విభిన్నమైన క్యారెక్టర్స్ ప్రయత్నించాలని ఉంటుంది. నేను తెలుగులోకి మల్లీ వస్తున్నాను అన్నప్పుడు కొత్తగా కనిపించాలని అనుకున్నాను. అతిథిలో నాకు అలాంటి అవకాశం దొరికింది. ఎందుకంటే తెలుగులోనే నేను పరిచయం అయ్యాను. తెలుగు ప్రేక్షకుల మనసులో ప్లేస్ సంపాదించుకోవాలని నాకెప్పుడూ ఉంటుంది.
 
- నేను ఈ వెబ్ సిరీస్ లో మాయ అనే క్యారెక్టర్ చేశాను. మాయ ఒక అందమైన అమ్మాయిగా కనిపిస్తాను. ఆ తర్వాత దెయ్యంగా కనిపిస్తాను. ఆమె ఒక మిస్టీరియస్ వుమెన్. అయితే మీరు ట్రైలర్ చూసింది కొంత పర్సెంట్ మాత్రమే. నా క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.
 
- అతిథి వెబ్ సిరీస్ కోసం ప్రవీణ్ సత్తారు గారి ఆఫీస్ కు వెళ్లి కథ విన్నప్పుడు చాలా గ్రిప్పింగ్ అండ్ స్ట్రెంత్ ఉన్న కథ అనిపించింది. ప్రవీణ్ సత్తారు గారు ఈ సిరీస్ ను బాగా డిజైన్ చేశారు. ఇందులో థ్రిల్లర్, ఫాంటసీ, హారర్ జానర్స్ కలిసి ఉంటాయి. ఇవన్నీ కథలో నెక్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రేక్షకులు ఊహించలేని మలుపులు ఉంటాయి. తెలుగులో హారర్ కంటెంట్ తక్కువగా వస్తుంటుంది. నాకు ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎందుకంటే నటిగా రొటీన్ గా ఉండొద్దని అనుకుంటా.
 
- వేణు గారితో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆయన ఇచ్చిన సలహాలతో నేను మరింత బాగా నటించగలిగాను. నటుడిగా ఆయన హ్యూమర్ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు. ఆయనది మంచి వ్యక్తిత్వం. కోస్టార్స్ తో ఎంతో సపోర్టివ్ గా ఉంటారు.
 
- మాయ క్యారెక్టర్ గా మారిపోయేందుకు నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నేను బయట చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటాను. మాయ చాలా కామ్ గా ఉంటుంది. ఎమోషన్స్ అన్నీ మనసులో దాచుకుంటుంది. నేను రియల్ లైఫ్ లో ఈ క్యారెక్టర్ కు అపోజిట్ గా ఉంటా. కానీ సెట్ లోకి రాగానే మాయ క్యారెక్టర్ లా ఉండేందుకు ట్రై చేశా.
 
- అతిథి వెబ్ సిరీస్ ను అరుంధతి, చంద్రముఖి లాంటి స్క్రిప్ట్స్ తో కంపేర్ చేయలేం. ఇదొక భిన్నమైన స్క్రిప్ట్. ఇలాంటి కథకు మంచి కాస్టింగ్ కావాలి. అలాంటి కాస్టింగ్ అతిథికి కుదిరింది. నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రెండూ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ఫార్మేట్స్ మారిపోయాయి. అన్ని రకాల ఆడియెన్స్ కు రీచ్ అవ్వాలనేది నా ప్రయత్నం.
 
- ఇవాళ ఆడియెన్స్ చాలా కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి కొత్తదనంతో  పాటు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ అతిథిలో ఉంటాయి. డైరెక్టర్ భరత్ వైజీ టాలెంటెడ్ పర్సన్. కామ్ గా సెట్ లో వర్క్ చేస్తుంటాడు. నేను అతన్ని బుద్ధ అని పిలుస్తుంటాను. ఇలాంటి డార్క్ కంటెంట్ ఎలా రాయగలుగుతున్నారు అని చాలాసార్లు అడిగాను. ఈ సినిమాతో భరత్ కు మంచి గుర్తింపు దక్కుతుంది.
 
- ప్రస్తుతం నేను గోలీసోడా అనే మరో వెబ్ సిరీస్ చేస్తున్నాను. అలాగే నేను చేసిన మూడు తమిళ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చాలాకాలం తర్వాత పవన్ కల్యాణ్‌ను కలవనున్న మాజీ హీరోయిన్?

నెరవేరిన కోరిక .. తిరుమలకు అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభం!

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. మెగా డీఎస్పీపై తొలి సంతకం..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల అధికారమే గొప్పది : మాజీ మంత్రి కేటీఆర్

లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్టు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments