Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరాఠా నటి సోనాలి కులకర్ణి తండ్రికి కత్తిపోట్లు

Webdunia
బుధవారం, 26 మే 2021 (14:14 IST)
మరాఠా నటి సోనాలి కులకర్ణి తండ్రి కత్తిపోటుకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దుండగుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అతన్ని పట్టుకునేందుకు సోనాలి తండ్రి ప్రయత్నించగా, అతనిపై దుండగుడు దాడిచేయడంతో ఈ కత్తిపోటు గాయం తగిలింది. 
 
మాహారాష్ట్రలోని పుణెలో పింప్రి చించ్ వాద్‏లో నివాసముంటున్న సోనాలీ ఇంట్లోకి మంగళవారం ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఒక ఫేక్ గన్, కత్తితోపాటు.. టెర్రస్ పై నుంచి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. వెంటనే అక్కడున్న పనిమనిషిని గమనించిన ఆ నిందితుడు.. కత్తితో ఆమెను బెదిరించి.. తన వెనుక పోలీసులు ఉన్నారని.. కాబట్టి చప్పుడు చేయకుండా.. ఎక్కడా దాక్కోవాలో చెప్పమని అడిగాడు.
 
అప్పుడే అక్కడకు వచ్చిన సోనాలి తండ్రి మనోహర్ ఆ ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోని ఆ ఆగంతకుడు దాడి చేయగా.. మనోహర్‌కు గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నాడు. అప్పటికే అప్రమత్తమై కాలనీవాసులు అతడిని పట్టుకోని పోలీసులకు అప్పజెప్పారు. 
 
అయితే సదరు వ్యక్తి సోనాలి అభిమాని అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం దోపిడి చేయడానికి మాత్రమే వచ్చి ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోనాలీ కులకర్ణి ఈ నెల మొదటి వారంలో దుబాయ్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ కునాల్ బెనోడెకర్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments