Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.గా 22 సినిమా - హీరో రూపేష్ కుమార్

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (16:28 IST)
Rupesh Kumar Chowdhury
రూపేష్ కుమార్ చౌద‌రి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 22. శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై  శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగ‌స్ట్2 హీరో రూపేష్ పుట్టిన‌రోజు. 
 
ఈ సంద‌ర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ, ``మాది బిజినెస్‌ ఫ్యామిలీ. చిన్న‌ప్ప‌టినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండ‌స్ట్రీలోకి రావ‌డం జ‌రిగింది. శివ ఈ క‌థ చెబుతున్న‌ప్పుడే ఎగ్జ‌యిట్ ఫీల‌య్యి ఈ సినిమా చేశాం ఇది ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. 22 నెంబ‌ర్ అనేది ఈ సినిమాలో మేజ‌ర్ పాయంట్‌.  ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ `రుద్ర‌` పాత్ర‌లో న‌టించాను. ఆ క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను నేను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నాను. 
 
'ఖైది నంబర్‌ 150', 'బాహుబలి', 'సాహో' వంటి చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్ చేశారు. మా డైరెక్ట‌ర్ శివకి ఇది మొద‌టిసినిమా అయినా త‌న‌కి ద‌ర్శ‌కత్వ శాఖ‌లో అనుభ‌వం ఉండ‌డంతో  ఫుల్ క్లారిటీతో సినిమా తీశారు. మేకింగ్, క్వాలిటీలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశాం. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫిస‌ర్ క్యారెక్ట‌ర్. బాలీవుడ్ న‌టుడు విక్రమ్‌జిత్ విర్క్ ఈ సినిమాలో నెగ‌టివ్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. 
 
మా సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి త‌గ్గి థియేట‌ర్స్  రీ ఓపెన్ చేశారు. మొన్న రిలీజైన సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి మా సినిమాని దస‌రా లేదా దీపావ‌ళికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని క‌థ‌లు విన్నాను వాటి మీద ఇంకా వ‌ర్క్ చేయాల్సి ఉంది``అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments