Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘సెబాస్టియన్‌ పిసి524’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల

Webdunia
గురువారం, 15 జులై 2021 (18:09 IST)
Sebastian look
‘రాజావారు రాణిగారు’ విజయం తర్వాత  కిరణ్‌ అబ్బవరం చేస్తున్న ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కొంచెం విరామం ఇచ్చి 'సెబాస్టియన్ పిసి524'తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు కిరణ్ అబ్బవరం రానున్నారు. 
 
కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. ప్రమోద్, రాజు నిర్మించారు. ఇందులో నమ్రతా దరేకర్‌, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్లు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హీరో కిరణ్ అబ్బవరానికి తొలి తమిళ చిత్రమిది. ఈరోజు (జూలై 15) హీరో పుట్టినరోజు సందర్భంగా బర్త్-డే లుక్ విడుదల చేశారు. 
 
నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ "కిరణ్ సబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బర్త్-డే లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆల్రెడీ క్రిస్మస్ కి విడుదలైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' విడుదలైన తర్వాత మా సినిమాను విడుదల చేస్తాం. పక్కా కమర్షియల్ సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో తీశాం" అని చెప్పారు.
 
బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ "పోలీస్ సెబా పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. రేచీకటి కల వ్యక్తిగా నటించడం అంత సులువు కాదు. కిరణ్ చాలా బాగా చేశారు. నటుడిగా గత చిత్రాలతో పోలిస్తే వ్యత్యాసం చూపించాడు. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది" అని అన్నారు. 
 
Kiran Abbavaram birthday
కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు (జూలై 15) సందర్భంగా ఒక రోజు ముందే, బుధవారం నాడు 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' రిలీజ్ టీజర్ విడుదల చేశారు. 'సెబాస్టియన్ పిసి524' బర్త్-డే లుక్ విడుదల చేశారు. అలాగే, 'సమ్మతమే' ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో ఆయన కుమార్తె కోడి దివ్యాదీప్తి నిర్మిస్తున్న సినిమాను ఈరోజు ప్రకటించారు. దీనికి మణిశర్మ సంగీత దర్శకుడు, కార్తీక్ శంకర్ దర్శకుడు. హీరోగా కిరణ్ అబ్బవరం ఐదో చిత్రమిది.
 
'సెబాస్టియన్ పిసి524' చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా) & యువరాజ్ (తమిళ్),, డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, కళ: కిరణ్‌, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, సహ నిర్మాత: సిద్ధారెడ్డి .బి, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి, నిర్మాతలు: ప్రమోద్ - రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments