Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది రీమేక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (10:58 IST)
ప‌వ‌ర్ స్టార్ కళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.


త‌మిళంలో ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి రీమేక్ చేస్తున్నారు. ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేస్తున్నాడు. తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం విడుదల చేసింది. 
 
2013లో విడుదలైన తెలుగు అత్తారింటికి దారేది సినిమాలో సమంత - ప్రణీత కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. సమంత పాత్రలో మేఘ ఆకాశ్ .. నదియా పాత్రలో ఖుష్బూ కనిపించనున్నారు. ఇక తెలుగులో ప్రణీత చేసిన పాత్ర కోసం కేథరిన్‌ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే జార్జియాలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments