నాగార్జునకు ఏమైంది? తారక్‌తో గొడవలా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:53 IST)
అక్కినేని నాగార్జున - నందమూరి తారక్ (జూనీయర్ ఎన్టీఆర్) వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునను బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే.. తారక్‌ ది రియల్ మేన్ ఛాలెంజ్‌ను నాగార్జునకు విసిరారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ గురించి నాగార్జున స్పందించలేదు. 
 
పోనీ.. ట్విట్టర్లో యాక్టీవ్‌గా లేరా అంటే... ఇటీవల శివమణి సినిమాలోని డైలాగ్స్‌ను కరోనా వైరస్‌కి లింకుపెడుతూ ఎవరో పంపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
 
అంతేకాకుండా.. ఈ టైమ్‌లో శివమణి సినిమా చేస్తే.. పూరి జగన్నాథ్ డైలాగ్స్‌ను ఇలా రాస్తాడు అంటూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. దీనికి పూరి కూడా స్పందిస్తూ.. సార్ మిస్ యు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 
 
మరి.. తారక్ ఛాలెంజ్‌ని నాగార్జున ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..? ఎందుకు స్పందించలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగార్జునకు ఏమైంది..? తారక్‌తో గొడవలా..? లేక వేరే ఏదైనా ప్రాబ్లమా..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి.. నాగార్జున ఈ ఛాలెంజ్ గురించి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments