స్టార్ హీరోలు తేనీటి విందు చేసిన వేళ‌

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (10:58 IST)
Pawan Kalyan, Prabhas, Amitabh
అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ ముగ్గురు క‌లిస్తే ఎలా వుంటుందో ఊహించుకోండి. ఏదైనా ఫంక్ష‌న్‌లో అయితే భ‌లే వుంటుంది. కానీ ముగ్గురు ఒకేసారి త‌మ త‌మ షూటింగ్‌ల‌లో ప‌క్క ప‌క్క‌నే వుండ‌గా జ‌రిగిన విశేషం. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌., ఎం.జి.ఆర్‌.లు అలా క‌లిసిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ లు రామోజీ ఫిలింసిటీలో క‌లిశారు.
 
ప్ర‌భాస్ త‌న తాజా సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. అదేవిధంగా అమితాబ్ కూడా అదే  ప్రాజెక్ట్ `కె` షూట్‌లో వున్నారు. ఆ ప‌క్క‌నే 
ఫ్లోర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ `భీమ్లానాయ‌క్‌`కు చెందిన పేచ్ వ‌ర్క్ నిన్న‌టితో ముగిసింది. ఈ ముగ్గురు ఉద‌య‌మే షూటింగ్ కు ముందుగానే క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం విశేషం. ఇది అక్క‌డివారికి క‌న్నుల పండ‌వ‌గా అనిపించింది. ఈ ముగ్గురు ఒకేసారి టిఫిన్ తిన‌డం తెలిసిన ఫిలింసిటీ యాజ‌మాన్యానికి చెందిన ప్ర‌ముఖులు వ‌చ్చి వ‌డ్డించ‌డం విశేషం. 
 
అమితాబ్ షూటింగ్ చేస్తున్నారని పవన్ తెలుసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ను పవన్ స్వయంగా వెళ్లి కలిశారు. అమితాబ్ కూడా ఉన్న ప్రభాస్ పవన్ ను  రిసీవ్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి అల్పాహారం కూడా చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సినిమా విశేషాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. త‌న సినిమా ఈనెల 25న విడుద‌ల‌వుతుంద‌ని ప‌వ‌న్, అమితాబ్ తెలియ‌జేశారు. ఆల్ ది బెస్ట్ అంటూ అమితాబ్ అన్నార‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments