Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

దేవీ
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (18:09 IST)
Shoban babu, chitti babu
పాతకాలం నటుడు శోభన్ బాబు గురించి అందరికీ తెలిసిందే. అప్పటి, ఇప్పటితరానికి ఆయన ఆదర్శంగా నిలుస్తుంటారు. సంపాదించిన దాచుకోవడమేని ఆయన తెలిసినంతగా ఎవరికీ తెలీదు. భూమిమీద రూపాయి పెట్టి కోటీశ్వరుడు అయిన ఆయన మొదట్లో చాలా బాధలు పడ్డారట. 200 రూపాయల కోసం పాముతో చెలగాటమాడే పాత్ర వేశాడట. భయంతో చేసిన ఆ పాత్ర గురించి నేపథ్యాన్ని రాజబాబు సోదరుడు చిట్టిబాబు  ఓ ఇంటర్యూలో ఇలా తెలియజేస్తున్నారు.
 
ఆయనతో పాటు వీనస్ స్టూడియోలో ఓ సినిమాషూటింగ్ పాల్గొన్నా. శోభన్ బాబు గారు శివుడి పాత్ర వేస్తున్నారు. ఆయన్ను చూడగానే నమస్కరించా. కానీ ఆయనలో భయం కనిపించింది. ఎందుకు ఈ పాత్ర వేస్తున్నారంటే.. ఆయన చెప్పిన మాట నాకు అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగింది...
 
 కోడంబాకంలో ఓ అద్దె ఇంటిలో పైన వుండేవాడిని. అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. కానీ రూమ్ లో ఫ్యాన్ లేదు. కొనాలంటే 200 రూపాయలు కావాలి. అది కూడా వాయిదా పద్దతిలో కట్టాలి. ఆ సమయంలో వీనస్ స్టూడియోలో పుల్లయ్యగారి దర్శకత్వంలో ఓ సినిమాలో వేషం వచ్చింది. అది శివుడి పాత్ర. మెడలో పాము వుంటుంది. నిజమైన పాము అది. భయంతో చెమటలు పట్టాయి. ఇది గ్రహించిన పుల్లయ్యగారు ఏమిటి? అని అడిగారు. సార్.. నేను నిజమైన శివుడ్నికాదు. ఇక్కడ నిజమైన మంచు లేవు. కానీ పాము మాత్రం నిజమైనది.. అంటే.. కాసేపు నిజమైన శివుడు అనుకో అన్నారు.. మరి ఎందుకని ఈ పాత్ర వేశారని చిట్టి బాబు అడిగితే.. ఈ పాత్ర వేస్తే 500 రూపాయలు ఇస్తానన్నారు. అందులో 200 పెట్టి ఫ్యాన్ కొనాలి అని సమాధానం చెప్పారు.
 
ఆ తర్వాత ఆనందంతో కొత్త ఫ్యాన్ కొని దూలానికి ఫ్యాన్ కట్టారు. పొద్దున్నే లేచి పండ్లు తోముకుంటూ కిందకి చూడగానే ఓనర్ కనబడ్డారట. ఓసారి ఫైకి రమ్మని శోభన్ బాబు పిలిచాడు. ఎందుకు? అని ఓనర్ అంటే.. నేను ఫ్యాన్ కొన్నాను సార్.అంటూ ఆనందంతో చెప్పారు. కాసేపటికి ఓనర్ పైకి వచ్చి. అదేమిటి? దూలానికి ప్యాన్ కట్టావ్. అది పడిపోతే నలుగురు చనిపోతారు. లేనిపోనిది నాపై కేసు పడుతుంది అంటూ, వెంటనే తీసేయ్ అంటూ పట్టుబట్టి మరీ ఫ్యాన్ తీయించారట.
 
అలాంటి వ్యక్తి ఆ తర్వాత అదే వీనస్ స్టూడియో, ఆ చుట్టుపక్కల కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎదగడం విశేషం. దాదాపు  చెన్నైలో సగం ఆయనదే అయ్యేలా చేసుకోగలిగాడు.. అంటూ సత్తిబాబు గతాన్ని నెమరేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments