ఈ నగరానికి ఏమైంది? నటుడిగా చేసినందుకు రూ.80 లక్షలు తీస్కున్నాడా?

ఇప్పుడిదే టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న మరో చర్చ. ఎప్పటి నుంచో ఓ టాక్ వుంది. అదేంటంటే... హీరో చాన్స్ కోసం నిర్మాత లేదా దర్శకుడికి డబ్బులివ్వడం. అసలు విషయానికి వస్తే... పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ డైరెక్టరుగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇటీవలే స

Webdunia
గురువారం, 19 జులై 2018 (14:17 IST)
ఇప్పుడిదే టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న మరో చర్చ. ఎప్పటి నుంచో ఓ టాక్ వుంది. అదేంటంటే... హీరో చాన్స్ కోసం నిర్మాత లేదా దర్శకుడికి డబ్బులివ్వడం. అసలు విషయానికి వస్తే... పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ డైరెక్టరుగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇటీవలే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రూపొందిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి దర్శకత్వం వహించడం, అది బాక్సాఫీసు వద్ద బోర్లాపడిపోవడం మనకు తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో నటించిన కొత్త నటుల్లో విశ్వక్ సేన్ అనే నటుడు కూడా వున్నాడు. 
 
గతంలో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన వెళ్లిపోమాక చిత్రంలో నటించాడు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దానితో ఈ నగరానికి ఏమైంది చిత్రం తీసేందుకు కొత్తవాళ్లను వెతుకుతున్నారని తెలుసుకుని తరుణ్ భాస్కర్‌ను సంప్రదించాడట. తనకు ప్రాముఖ్యమైన పాత్ర ఇస్తే రూ. 80 లక్షలు ఇస్తానని చెప్పడం, తరుణ్ తలూపడం జరిగిపోయిందట. దీనితో విశ్వక్ సేన్ అందులో నటించాడు. 
 
చిత్రమైతే విడుదలైంది కానీ చిత్తు చిత్తు అయ్యింది. సినిమా వారానికి చతికిలపడింది. అందులో నటించినవారు ఇప్పుడు బయటకు వస్తే ఎవరూ గుర్తు పట్టే పరిస్థితి కూడా లేదు. దీనితో రూ. 80 లక్షలు పెట్టిన విశ్వక్ సేన్‌కు కనీసం నెక్ట్స్ పిక్చర్లో ఆఫర్ అయినా వస్తుందేమోనని ఎదురుచూపులు చూస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments