Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డ విశాల్!

Webdunia
గురువారం, 7 జులై 2022 (19:52 IST)
Vishal Engagement photo
న‌టుడు విశాల్ ఇప్పుడు ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న లాఠీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న త‌న పెండ్లి గురించి మాట్లాడాడు. 2019లో హైద‌రాబాద్‌కు చెందిన అనీషా విల్లాతో నిశ్చితార్థం జ‌రిగింది. ఆ త‌ర్వాత త్వ‌ర‌లో పెండ్లి చేసుకోబోతున్నాడ‌ని అనుకుంటున్న త‌రుణంలో నిశ్చితార్థం కేన్సిల్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆయ‌న అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లుకూడా వేశారు.
 
కాగా, ఇప్పుడు తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ.. ప్రేమ‌, పెండ్లి విష‌యమై యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చాడు. ఈసారి పెద్ద‌లు కుదిర్చిన సంబంధం చేసుకోను. నాకు ఇష్ట‌మైన అమ్మాయిని చేసుకుంటాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. గ‌తంలోనే విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మిని ప్రేమించాడ‌నే వార్త‌లుకూడా వ‌చ్చాయి. ఇద్ద‌రూ మంచి స్నేహితుల‌మ‌ని వ‌ర‌ల‌క్ష్మీ ఆ త‌ర్వాత తెలియ‌జేసింది. స‌రైన స‌క్సెస్ లేని విశాల్ ఇప్పుడు ఫోక‌స్ అంతా కెరీర్‌పైనే పెడ‌తానంటున్న విశాల్ న‌డిగ‌ర్ సంఘం భ‌వంతి ప‌ని కూడా పూర్తి చేయాల‌నేది కూడా తెలియ‌జేస్తున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

రెమాల్ తుపాను ఎఫెక్ట్.. ముందుగానే నైరుతి రుతుపవనాలు

రేవంత్ రెడ్డికి ఆ యోగం లేదని చెప్పిన వేణు స్వామిని ఆడుకుంటున్న నెటిజన్స్

అసైన్డ్ భూముల పేరిట భూ కుంభకోణం.. చంద్రబాబు ఆరా

ప్రపంచ పాల దినోత్సవం.. ఆరోగ్య ప్రయోజనాల కోసం పాల ఉత్పత్తులను..?

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. పదేళ్ల గడువు ఒక్క రోజులో..?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments