Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్త‌యిన మీలో ఒకడు

Webdunia
గురువారం, 7 జులై 2022 (18:41 IST)
Lion Kuppili Srinivas, Hritika Singh
లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం `మీలో ఒకడు. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు..సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు , గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ , సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.. కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్ , సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A  స‌ర్టిఫికేట్‌ సోంతం చేసుకుంది..సెన్సార్ స‌భ్యుల చేత ప్ర‌సంశలు అందుకున్న  ఈ మూవీని జులై 22న స్ర్కీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్  థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది..
 
హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి క‌థ , క‌థ‌నాల‌తో  ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా మీలో ఒక‌డు చిత్రాన్ని నిర్మించామ‌ని అన్నారు.. హీరో సుమ‌న్ , హీరో కుప్పిలి శ్రీనివాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు , హీరో,హీరోయిన్ల్ మ‌ధ్య రోమాంటిక్ సన్నివేశాలు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ కామెడీ ఈ సినిమా కు హైలెట్ గా నిలుస్తాయ‌ని తెలిపారు.. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, రాసిన పాట‌ల‌ను సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు పాడార‌ని ..ఆ పాట‌లకు ఇప్ప‌టికే  మంచి రెస్సాన్స్ వ‌చ్చింద‌ని, అంతేకాకుండా సీనియ‌ర్ టెక్నిషియ‌న్స్ తో ఈ సినిమా ను క్వాలిటిగా రూపోందించామ‌ని అన్నారు...తెలుగు రాష్ట్రాల‌లో జులై 22న థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్న ఈ  సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంద‌ని అశాభావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments