Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ చిత్రంలో విజయశాంతి... ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత సై

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:56 IST)
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతోంది. దీని తర్వాత మహేష్‌బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాలో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  
 
ఈ సినిమా కోసం ఇప్పటికే యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే మహేష్ సినిమా కావడంతో ఇందులో నటించేందుకు రాములమ్మ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి భారీగా కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. ఎక్కువ మొత్తం అయినప్పటికీ ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 
 
విజయశాంతి హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. అప్పట్లో శ్రీరాములమ్మ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత కూడా విజయశాంతి అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments