మెగాస్టార్‌కు చెల్లిగా రాములమ్మ? - విజయశాంతి సమ్మతించేనా?

Webdunia
సోమవారం, 25 మే 2020 (15:54 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి - విజయశాంతి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. 1980-90 మధ్య కాలంలో వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చిందంటే అది సూపర్ హిట్టే. బాక్సాఫీస్‌ను షేక్ చేయాల్సిందే. అలాంటి కాంబినేషన్ మరోమారు రిపీట్ కాబోతుందనే ప్రచారం ఫిల్మ్ నగరులో జోరుగా సాగుతోంది. 
 
మలయాళ సూపర్ స్టారో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం "లూసిఫర్". మలయాళంలో సూపర్ డూపర్ హిట్. ఈ చిత్రాన్ని తెలుగులోకి చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. ఈ చిత్రానిసి 'సాహో' దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. 'ఆచార్య' సినిమా తర్వాత ఇది సెట్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
 
అయితే, ఈ చిత్రంలో విజయశాంతిని ఓ కీలకమైన పాత్రకు అడుగుతున్నట్టు సమాచారం. మలయాళం ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ వేసిన పాత్ర ఇది. హీరో చిరంజీవికి చెల్లి పాత్ర. మొదటి నుంచీ కారణాంతరాల వల్ల అన్నని ఇష్టపడని చెల్లి తన పెళ్లి కూడా తన ఇష్టప్రకారమే చేసుకుంటుంది. పలు డైమన్షన్లు కలిగివున్న ఈ పాత్ర అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
 
మరి, ఇన్నాళ్లూ హీరో హీరోయిన్లుగా నటించిన చిరు, శాంతి జంట ఇలా అన్నా చెల్లెళ్లుగా నటిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు విజయశాంతి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారా? అన్నది చూడాలి! పైగా, విజయశాంతి కూడా చాలా రోజుల తర్వాత ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments