Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ - చైతు మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ ఇదే..!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (12:10 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎప్ప‌టి నుంచో ఈ సినిమాపై వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. క‌థ ఏంటి అనేది బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఇందులో వెంకీ - చైతు మేన‌మామ‌, మేన‌ల్లుడుగా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి ఫ్యామిలీల మ‌ధ్య గొడ‌వలు ఉంటాయ‌ట‌. 
 
అవి ఏంటి..? ఆ గొడ‌వ‌లు ఎలా ప‌రిష్కార‌మ‌య్యాయి. దీనికి వెంకీ- చైతు ఏం చేసారు అనేదే క‌థ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే... మురారి సినిమా క‌థ‌కి దీనికి పోలీక‌లు ఉంటాయ‌ని తెలిసింది. మ‌రో విష‌యం ఏంటంటే... నితిన్ తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా క‌థ కూడా ఇలాగే ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఈ మూవీపై వ‌స్తోన్న వార్త‌లపై చిత్ర యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments