Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతు ఫ‌స్ట్ టైమ్ ఆ త‌ర‌హా పాత్ర చేస్తున్నాడ‌ట‌..!

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ఓ వైపు స‌వ్య‌సాచి, మ‌రో వైపు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌వ్య‌సాచి కోసం లాస్ట్ షెడ్యూల్‌ని అమెరికాలో ప్లాన్ చేసారు. ఇదిలా ఉంటే.... ప్ర‌స్తుతం

Advertiesment
చైతు ఫ‌స్ట్ టైమ్ ఆ త‌ర‌హా పాత్ర చేస్తున్నాడ‌ట‌..!
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (19:55 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ఓ వైపు స‌వ్య‌సాచి, మ‌రో వైపు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌వ్య‌సాచి కోసం లాస్ట్ షెడ్యూల్‌ని అమెరికాలో ప్లాన్ చేసారు. ఇదిలా ఉంటే.... ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమా హైద‌రాబాదులో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. నాగ‌చైత‌న్య పైన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 
 
ఈ సినిమాలో చైత‌న్య కారు డ్రైవ‌ర్‌గా, ప్రైవేట్ డిటేక్టివ్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం చైతు కెరీర్లో ఇదే ఫ‌స్ట్ టైమ్. హీరోయిన్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా క‌థ సాగుతుంద‌ట‌. చైతు స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. 
 
ఈ సినిమాని ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్థంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యుద్ధం శ‌ర‌ణంతో డీలా ప‌డ్డ చైతు స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఈ రెండు సినిమాల‌తో వ‌రుస విజ‌యాలు సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లాననీ...