Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీఖన్నాను చంపేస్తానంటున్న హీరో వరుణ్ తేజ్!! ఎందుకు?

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:29 IST)
హీరోయిన్ రాశీఖన్నాను చంపేస్తానని అంటున్నారు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ అంటున్నారు. పైగా, సాయిపల్లవిని వివాహం చేసుకుని, పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానంటూ ధైర్యంగా చెపుతున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అయ్యాయి. 
 
అయితే, వరుణ్ తేజ్ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఇక్కడ తెలుసుకుందాం. సినీ నటి మంచి లక్ష్మీ వ్యాఖ్యాతగా ఫీట్ ఆఫ్ విత్ స్టార్స్ అనే రియాలిటీ షో జరుగుతోంది. ఇందులో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. ముగ్గురు హీరోయిన్ల సాయి పల్లవి, రాశీ ఖన్నా, పూజా హెగ్డేల పేర్లు చెప్పి... వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవరిని చంపేస్తావు? అని ప్రశ్నించింది. 
 
దీనికి వరుణ్ తేజ్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చాడు. తాను మొదట సాయిప‌ల్ల‌విని పెళ్లి చేసుకుంటాను, రాశీఖ‌న్నాను చంపేస్తా, పూజా హెగ్డేతో డేటింగ్‌కి వెళ‌తాను అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీంతో మంచి లక్ష్మి ఖిన్నురాలైంది. 
 
కాగా, వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేశ్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments