Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోల కంటే ఫీజు ఎక్కువ.. నిమిషానికి రూ.కోటి తీసుకుంటోంది.. ఎవరు?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (13:01 IST)
తెలుగు చిత్రసీమలో హీరోలు భారీగా పారితోషికం పుచ్చుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఓ హీరోయిన్ అందరూ నోటిపై వేలు పెట్టేలా భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటోంది. ఆ నటి మాత్రం హీరోలను తలదన్నేలా మూడు, నాలుగు నిమిషాల వ్యవధి ఉంటే ఒక్క స్పెషల్ సాంగ్‌కే భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటోంది. ఆమె ఎవరో కాదు.. ఊర్వశీ రౌతేలా. 
 
మెగాస్టార్‌ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో బాస్ సాంగుకు స్టెప్పులేసిన ఊర్వశీ రౌతేలా ఏకంగా రూ.2కోట్లు అందుకుంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ తర్వాత ఏజెంట్ సినిమాలో అఖిల్ కోసం ఊర్వశీ స్టెప్పులేసింది. ఈ పాటకు బాగానే నిర్మాతల నుంచి డబ్బు లాగేసుకుందని టాక్. 
 
అలాగే పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల కాంబోలో వస్తోన్న 'బ్రో' సినిమాలో 'మై డియర్‌ మార్కండేయ' స్పెషల్‌ సాంగ్‌కు చిందులేసిన ఈ బ్యూటీ రూ.2కోట్లు అందుకుందని సమాచారం.
 
అంతే కాకుండా తాజాగా ఊర్వశీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆఫర్లు రావడంతో ఆమె తన ఫీజు కూడా పెంచేసిందని సమాచారం. ఇప్పటికే పుష్ప-2లోని ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేసే అవకాశం దక్కించుకుంది.  అందుకు ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
ఇంకా ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ 'స్కంధ' చిత్రంలో మూడు నిమిషాల పాటకు రూ.3 కోట్లు డిమాండ్‌ చేసిందట. అంటే నిమిషానికి రూ.కోటి అన్న మాట. తెలుగు చిత్రసీమలో హీరోలు గరిష్ఠంగా రూ.2 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకుంటారని టాక్‌. వీరి కంటే ఊర్వశీ ఎక్కువ తీసుకుంటుందన్న మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments