Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాం చరణ్‌కు సరిజోడిని కాదు... మా ఆయనకు చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు : ఉపాసన

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కేవలం రాంచరణ్ భార్యగా మాత్రమే కాదు.... ఇతర కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (13:01 IST)
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కేవలం రాంచరణ్ భార్యగా మాత్రమే కాదు.... ఇతర కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వివాహం సమమంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. 
 
అందుకు కారణం ఉపాసన అప్పట్లో లావుగా ఉండటమే. ఆ తర్వాత కొన్నాళ్లకు ఉపాసన, రాంచరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెర్రీకి టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయిన్ ఉండగా, ఇతనిపై వస్తున్న పుకార్లు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ పుకార్లని, మెగా ఫ్యామిలీ అంతగా పట్టించుకోలేదు. అయితే ఊహాగానాలు మరింత జోరందుకోవడంతో ఎట్టకేలకు రాంచరణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 
 
రాంచరణ్, ఉపాసనలు విడాకులు తీసుకోబోతున్నారని, అందుకు కారణం సానియా మీర్జా అని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన రాంచరణ్ సానియా మీర్జా తనకు ఫ్రెండ్ మాత్రమే అని తెలిపాడు. ఇదిలావుంటే... తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయంపై స్పందించారు. ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలతొ పాటు షాకయ్యే విషయాలు కూడా ఉన్నాయి. 
 
నిజమే.... అప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. నేను చరణ్‌కి సరిజోడికాదు అంటే సంతోష పడే విషయమే.. మా ఆయనకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. వారంతా తనకు ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారనేగా, ఇది బాగుంది... దీన్ని ఒక పొగడ్తగానే తీసుకుంటా అంటూ ఉపాసన తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

మేమూ అందరిలాగే నార్మల్ కపుల్. బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో. అసలు మేము విడాకులు ఎందుకు తీసుకుంటాం. నిజంగా అలా అయితే బయటి ప్రపంచానికి చెప్పుకోగలిగే ధైర్యం ఉన్న మనుషులం. ఎవరేమైనా రాసుకోండి ఇప్పుడైతే దాని గురించి పట్టించుకోను అని ఉపాసన ఘాటుగా వ్యాఖ్యానించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments