Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్రిపాలెం అభివృద్ధి భేష్.. జయదేవ్‌కు ధన్యవాదాలు.. ప్రిన్స్ మహేష్ బాబు

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం సూపర్‌స్టార్‌ కృష్ణ స్వగ్రామం. ఈ ఊరిని సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు' సినిమా విడుదల సమయంలో దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:23 IST)
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం సూపర్‌స్టార్‌ కృష్ణ స్వగ్రామం. ఈ ఊరిని సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు' సినిమా విడుదల సమయంలో దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌.. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో బుర్రిపాలెం రోడ్లను, డ్రెయిన్లలను మరమ్మత్తులు చేయించారు.

ఈ విషయాన్ని మహేష్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశారు. బుర్రిపాలెం అభివృద్ధికి పాటుపడుతున్న జయదేవ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ స్వగ్రామమైన బుర్రిపాలెం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియా సార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క బిజినెస్ తారా స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల నుడి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందట.
 
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ చిత్రం యొక్క శాటిలైట్, ఆడియో ఈవెంట్ హక్కుల కోసం సుమారు రూ. 18. 5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేరే షెడ్యూల్ కోసం త్వరలోనే అహ్మదాబాద్ వెళ్లనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. చెరో మూడేసి రోజులు.. బాండ్‌పై సంతకం

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

మాజీ మంత్రి విడదల రజనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట- ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments