Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితా రాజశేఖర్ ప్రాపర్టీని ఉపాసన తీసుకుంటున్నారా?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (22:04 IST)
సినీ పరిశ్రమలో జరిగే లావాదేవీలు సెలబ్రిటీల లావాదేవీల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తారల వ్యక్తిగత జీవితాల మీద అందరికీ శ్రద్ధ ఉంటుంది. అలా తాజాగా జీవితా రాజశేఖర్ తన ఆస్తిని ఉపాసనకు అమ్మేస్తున్నట్లు సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.
 
ఆ ప్రాపర్టీ మొత్తాన్ని ఉపాసనకు ఇస్తేన్నట్లు.. దీనికి సంబంధించిన ఇద్దరి మధ్యా మాటలు కూడా నడిచాయంటూ ప్రచారం నడుస్తోంది. ఫిలిం నగర్లో ప్రాపర్టీ జీవితకు ఉందట. అయితే ఇందులో వేరే సంస్థల వాటా ఉందట. అయితే ఇందులో ఒక్క జీవితా రాజశేఖర్‌కు మాత్రమే షేర్స్ 200 కోట్ల దాకా ఉందట.
 
వాటిని అమ్మేసి వేరేచోట మరో ప్రాపర్టీని కొనాలని ప్రయత్నిస్తున్నారట జీవితా రాజశేఖర్. ఈ ప్రాపర్టీని ఉపాసన చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారట. అయితే జీవిత ప్రాపర్టీలోని హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు, ఎన్టీఆర్లకు కూడా షేర్లు ఉన్నాయని తెలుస్తోంది.
 
ఇక్కడ ఎలాగైనా ఈ ప్రాపర్టీని అమ్మేసి విప్రో సర్కిల్లో మరో ప్రాపర్టీని కొనాలని ప్లాన్ ఎప్పుడో వేసేసుకున్నారట జీవిత. అయితే ఈ వ్యవహారపై ఇద్దరి మధ్యా బేరాలు కొలిక్కి రావడం లేదట. ముందు నుంచే చిరంజీవి ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నారు రాజశేఖర్. ఇలాంటి సమయంలో వీరి మధ్య లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిగే అవకాశం లేదని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.
 
మొదట్లో తమ ప్రాపర్టీలోని షేర్లు 200 కోట్లు ఉంటుందని.. ఆ డబ్బు మొత్తం ఇచ్చి తీసుకోమని ఉపాసనకు చెప్పారట. ఉపాసన అందుకు ఒప్పుకోలేదట. ప్రాపర్టీ అంత వాల్యు ఉండదని.. కాబట్టి తక్కువగా ఇస్తానని ఆ రేటు ఎంతో కూడా చెప్పేసిందట. ఇప్పుడిదే అసలు సమస్యకు కారణమవుతోంది. ఒకవైపు చిరంజీవి, రాజశేఖర్‌ల మధ్య గొడవ.. ఇప్పుడు తాజాగా లావాదేవీలు కాస్త ఎక్కడికి తీసుకెళుతుందోనన్న చర్చ సినీపరిశ్రమలో బాగానే జరుగుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments