నటుడు ప్రకాష్ రాజ్ `మా`అధ్యక్షునిగా పోటీ చేయడం పట్ల సినిమారంగంలో పెద్ద చర్చగా మారింది. ప్రకాష్‌రాజ్ వ్యక్తిగతం, వృత్తిగతంగా ఎవ్వరూ ఆయన్ను సమర్థించడంలేదు. చిలికి చిలికి గాలివానలా అది మెగా ఫ్యామిలీకి చుట్టుకునేట్లుగా వుంది. ఇక వివరాల్లోకి వెళితే నిన్న ప్రకాష్‌రాజ్ పెట్టిన ప్రెస్‌మీట్‌లో పలు విషయాలు ప్రస్తావించారు. నాకు ఒక గొప్ప విజన్ వుందని అన్నాడు. ఆ విజన్ ఏమిటో నేను ఇప్పటికే చేసి చూపించానంటూ పలు కార్యక్రమాల వివరాలు నరేశ్ మీడియా ముందు తెలియజేశారు. ఇవన్నీ ఇప్పుడు ప్రకాష్‌రాజ్ పానల్‌లోని సభ్యులకు తెలుసు. ఇవి పెద్ద చర్చకు వస్తే భవిష్యత్‌లో ఆయనకు సపోర్ట్‌గా నిలిచినవారికి చెడ్డపేరు వస్తోందని అన్యాపదేశంగా తెలియజేశారు.
ప్యానల్ ఎంతమందో కూడా తెలీదు
ప్రకాష్‌రాజ్ ప్యానల్‌లో 27 మంది అంటూ ప్రకటించారు. అసలు వుండేది 26 మందే. మరి ఒకరిని ఎక్కవగా చెప్పారు. అలాగే `మా`గురించి ఓనమాలు తెలీవు. చాలాసార్లు `మా` ఎన్నికల్లలో ఓటే వేయలేదు. జనరల్ బాడీ కి హాజరుకాలేదు అని తేల్చిచెప్పారు.
బైలాస్ కూడా తెలీదు
`మా` బైలాస్‌లో సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చు అని వుంది. దాన్నిబట్టి సాధ్యా సాధ్యాలు చూసి పోటీ చేసుకోవచ్చు. అది ఓకే నేను ఆయన పోటీకి వ్యతిరేకంకాదు. అయితే పోటీకిముందు మా గురించి పూర్తిగా స్టడీ చేయాలి. ఆయన చేసిందేమీలేదు. ప్రస్తుత బాడీ సెప్టెంబర్ వరకు వుంది. ఈలోగా కొన్ని పనులు కరోనా వల్ల ఆగిపోయాయి. అవన్నీ చేసి చూపిస్తాను. ఎలక్షన్లకు వెళ్ళానుకుంటే ప్రస్తుత అధ్యక్షుడిగా నేను కాల్‌ఫర్ చేయాలి. రూల్ ప్రకారం చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఎన్నికలకు పిలుపు ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నించారు.